NIMS Hospital Expansion: నూతన సచివాలయంలో మంత్రి హరీష్ రావు తొలి సమీక్ష సమావేశం నిర్వహించారు. నిమ్స్ ఆసుపత్రి విస్తరణపై అధికారులతో చర్చించారు. నిమ్స్‌లో నూతన భవన నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రజల్లో కరోనావైరస్ వ్యాక్సిన్ (Corona vaccine)పై నమ్మకం పెంచేందుకు తొలి టీకాను తానే తీసుకుంటానని తెలంగాణ (Telangana) వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. కొత్తరకం కరోనాతో భయపడాల్సిన అవసరం లేదని, బర్డ్‌ఫ్లూ వల్ల కూడా ఎలాంటి నష్టం లేదని ఈటల స్పష్టంచేశారు.
భారత్ ఫార్మా దిగ్గజం హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ( Bharat Biotech ) సంస్థ అభివృద్ధి చేసిన కోవాక్సిన్ (Covaxin) క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా జరుగుతున్నాయి. కరోనావైరస్ ( Coronavirus ) ను కట్టడి చేసేందుకు మొదటి దశలో భాగంగా దేశంలోని పలు ఆసుపత్రుల్లో ఈ టీకాను దాదాపు 60మంది వలంటీర్లపై ప్రయోగిస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.