LK Advani Admitted Into Appollo Hospital: బీజేపీ అగ్ర నాయకుడు, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానీ అస్వస్థతకు గురయ్యారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అతడిని కుటుంబసభ్యులు ఢిల్లీలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అతడి ఆరోగ్యంపై బీజేపీ, ఎన్డీయే నాయకులు ఆందోళన చెందుతున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితి వివరాలు ఇలా ఉన్నాయి.
LK Advani: బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉపప్రధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. కొన్నిరోజులుగా ఆయన వయస్సురిత్యా అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు.
Advani - Manmohan Singh: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా 80 యేళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్ కు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునేలా ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే పలువురు పెద్దవాళ్ల ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు బీజేపీ సీనియర్ నేత అద్వానీతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇంటి నుంచే ఓటు వేసారు.
Bharat Ratna Awards: భారత ప్రభుత్వం 2023కు గాను ఐదుగురికి భారతరత్న అవార్డులు ప్రకటించగా ఆ అవార్డులను శనివారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అందించారు. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో జరిగిన వేడుకలో అవార్డు పొందిన వారి కుటుంబసభ్యులు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి, కేంద్ర మంత్రులు, అవార్డు గ్రహీత కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
Ram mandir Pran Pratishtha: అయోధ్య రామమందిరం కల నెరవేరనుంది. ఆ కల సాకారానికి శ్రీకారం చుట్టిన కురువృద్ధుడు మాత్రం ప్రాణ ప్రతిష్ఠకు దూరంగానే ఉండిపోనున్నారు. అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠ పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Ayodhya Ram Mandir - Advani Ratha yatra: అయోధ్య రామ మందిరం నిర్మాణానికి, బీజేపీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ చేసిన రథయాత్రకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన చేసిన రథయాత్రతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణ కల సాకారమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన రథయాత్ర రామ మందిరం నిర్మాణంతో పాటు దేశ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేసాయో చూద్దాం..
LK Advani on Rammandir: అయోధ్య రామమందిరం ప్రారంభం మరి కొద్దిరోజుల్లో జరగనుంది. ఈ సందర్భంగా రామ జన్మభూమి ఉద్యమం ప్రారంభించిన బీజేపీ సీనియర్ నేత లాల్‌కృష్ణ అద్వానీ అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి వివరాలు మీ కోసం..
భారతీయ జనతా పార్టీ (BJP) అగ్రనేత, మాజీ ఉపప్రధాని ఎల్కే అద్వానీ ( Lal Krishna Advani ) నేటితో 93వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా అగ్రనేతకు శుభాకాంక్షల వెల్లువ వెల్లువెత్తుతోంది. ఎల్కే అద్వానీ జన్మదినాన్ని (LK Advani Birthday) పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం బాబ్రీ మసీదు తీర్పు వెలువడింది. ప్రతిపక్షాలకు చుక్కెదురైంది. పలు రాష్ట్రాల్లో ఎన్నికల జరగనున్న నేపధ్యంలో బాబ్రీ తీర్పు కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీకు కచ్చితంగా లాభించే అంశంగా మారనుంది.
బాబ్రీ మసీదు విధ్వంసం కేసు తీర్పు 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వెలువడింది. నిందితులంతా నిర్దోషులేనని తీర్పు ఇచ్చిన ఆ న్యాయమూర్తి..కాస్సేపటికి రిటైరయ్యారు. కారణమేంటి?
బాబ్రీ మసీదు విధ్వంసం. దేశ రాజకీయాన్ని మార్చేసిన అంశం. 28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం నిందితులంతా నిర్దోషులేనని సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై బీజేపీ సీనియర్ నేత నిర్దోషిగా ప్రకటితమైన ఎల్కే అద్వానీ ఏమన్నారు మరి ?
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) లో సంచలన తీర్పు వెలువడింది. బాబ్రీ మసీదు కూల్చివేతను ప్లాన్ ప్రకారం చేసింది కాదని, నిందితులుగా ఉన్నవారంతా నిర్దోషులేనంటూ ధర్మాసనం తీర్పునిచ్చింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసు (Babri Masjid demolition case) పై ఈరోజు (Sep 30) తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం ఈ రోజు తీర్పును ప్రకటించనుండటంతో కేంద్ర హోంశాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది.
28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసుపై ఈనెల 30న తీర్పు వెలువడనుంది. దాదాపు రెండేళ్లనుంచి రోజువారీ విచారణను చేపట్టిన సీబీఐ ప్రత్యేక ధర్మాసనం తీర్పు ప్రకటించడానికి సంసిద్ధమైంది. అయితే తీర్పు రోజున ఈ కేసులో నిందితులుగా ఉన్న వారంతా కోర్టుకు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఎస్కే యాదవ్ ఆదేశించారు.
రామ జన్మభూమి ( Ram janmabhoomi ) అనగానే గుర్తొచ్చే పేరు బీజేపీ అగ్రనేత ఎల్ కే అద్వానీ. ఆగస్టు 5 రామాలయ శంకుస్థాపన మహోత్సవం సందర్భంగా ప్రత్యక్షంగా పాల్గొనలేకపోతున్న ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అయోధ్య రామాలయానికి..అద్వానీకున్న సంబంధమేంటి ?
అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను ఆగస్టు 31 లోపు పూర్తిచేయాలన్న సుప్రీం కోర్టు (Supreme Court of India) ఆదేశాల మేరకు సీబీఐ కోర్టు ప్రతీరోజు విచారణ జరుపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.