Ayodhya Ram Mandir - Advani: అయోధ్య రామజన్మభూమికి ఊపు తీసుకొచ్చిన అద్వానీ రథయాత్ర..

Ayodhya Ram Mandir - Advani Ratha yatra: అయోధ్య రామ మందిరం నిర్మాణానికి, బీజేపీ అగ్ర నేత లాల్ కృష్ణ అద్వానీ చేసిన రథయాత్రకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన చేసిన రథయాత్రతో అయోధ్యలో రామ మందిరం నిర్మాణ కల సాకారమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో ఆయన చేసిన రథయాత్ర రామ మందిరం నిర్మాణంతో పాటు దేశ రాజకీయాలను ఏ విధంగా ప్రభావితం చేసాయో చూద్దాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2024, 01:21 PM IST
Ayodhya Ram Mandir - Advani: అయోధ్య రామజన్మభూమికి ఊపు తీసుకొచ్చిన అద్వానీ రథయాత్ర..

Ayodhya Ram Mandir - Advani Ratha Yatra:ఈ రోజే అయోధ్య భవ్య రామ మందిరంలో బాల రాముడు కొలువు తీరనున్నాడు. తన జన్మ ప్రదేశంలో రామ్ లల్లా కొలువు తీరడానికి ఎంతో మంది రామ భక్తులు తమ రక్తాన్ని తర్పణంగా అర్పించారు. 5 శతాబ్దాల కల.. ఎన్నో దశాబ్దాల పోరాట ఫలితంగా అయోధ్యలో రాముడు కొలువు తీరాడు. ముఖ్యంగా రామ మందిరం ఉద్యమానికి మంచి ఊపు తీసుకొచ్చింది. బీజేపీ సీనియర్ నేత ఎల్.కే.అద్వానీ సోమనాథ్ నుంచి అయోధ్యకు ప్రారంభించిన రథ యాత్ర. ఇక మన సంస్కృతిలో రథయాత్ర పదానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దేశ వ్యాప్తంగా ఆలయాల్లో జరిగే ఉత్సవాల్లో దేవుడికి రథయాత్రకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇక అందరికీ రథయాత్ర అనగానే పూరీలో కొలువైన జగన్నాథ రథయాత్ర గుర్తుకు వస్తుంది. ఆ తర్వాత రథయాత్ర అంటే అయోధ్య రామ మందిరం కోసం అప్పటి భారతీయ పార్టీ అధ్యక్షుడు లాల్ కృష్ణ అద్వానీ చేసిన రథయాత్ర గుర్తుకు వస్తుంది. ఈయన చేసిన రథయాత్ర దేశ రాజకీయాలను సమూలంగా మార్చేసిందనే చెప్పింది. ఇప్పటి రామ మందిర నిర్మాణం వెనక ఆయన చేసిన రథయాత్రనే కీలకంగా నిలిచింది. రామ భక్తుల్లో రాముడు పుట్టిన అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరగాలనే ఆకాంక్షను ఇది మరింత బలోపేతం చేసింది. ఇక అద్వానీ రథయాత్రకు సుధీర్ఘ నేపథ్యమే ఉంది.

రామ మందిరం కోసం పోరాడాలని విశ్వహిందూ పరిషత్ నిర్ణయం తీసుకుంది. 1984లో ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా ఉన్న సమయంలో దిల్లీలో సాధు సంతులతో జరిగిన సమావేశంలో దీనికి బీజాలు పడ్డాయి. ఇక రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న కాలంలో షాబానో మనోవర్తి కేసు పెను సంచలనం సృష్టించింది. ఇక ముస్లిమ్స్ ను సంతృప్తి పరిచేందక పార్లమెంటులో ఏకంగా చట్టాన్ని మార్చేసారు. ఈ సంఘటన తన మనసును మార్చేసిందని అద్వానీ జీ తన జీవిత కథ 'మై కంట్రీ మై లైఫ్' పుస్తకంలో పొందుపరిచారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం చేయాలనుకున్న హిందువుల న్యాయమైన డిమాండ్ ను ముస్లిమ్స్‌ వ్యతిరేకించడాన్ని అద్వానీని ఆందోళనకు గురి చేసింది. 1986లో రామ జన్మభూమి ఉద్యమం ఊపందుకోవడం.. 1989 నాటికి దేశ వ్యాప్తంగా రామ శిల కార్యక్రమం అయోధ్య రామ మందిర నిర్మాణం చేయాలనే వేడిని పెంచాయి.

1989లో జూన్‌లో హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన పాలంపూర్‌లో జరిగిన భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో అయోధ్యలో రామ మందిర ఉద్యమానికి మద్దతు పలికింది. ఆ తర్వాత బీజేపీ తన మేనిఫెస్టోలో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి చోటు దక్కింది. ఆ తర్వాత 1989లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 85 సీట్లు దక్కించుకుంది. అంతకు ముందు బీజేపీకి పార్లమెంటులో ఉన్న స్థానాల సంఖ్య 2 మాత్రమే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 197 సీట్లు గెలుచుకుంది. అటు జనతాదళ్ 143 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత బీజేపీ, వామపక్షాలు బయట నుంచి ఇచ్చిన మద్ధతుతో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ నేషనల్ ఫ్రంట్ పేరుతో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు.

ఎన్నికల ముందే సీట్ల సర్ధుబాటు విషయంలో వీపీ సింగ్, బీజేపీ మధ్య అయోధ్య రామ మందిరం అంశం చర్చకు వచ్చింది. ఎన్నికల తర్వాత 1990 ఫిబ్రవరిలో సాధువులు కరసేవకు పిలుపునిచ్చారు. అయితే అప్పటి ప్రధాని వీపీ సింగ్.. నాలుగు నెలల్లో అయోధ్య రామ మందిర నిర్మాణంపై కీలక నిర్ణయంతో పాటు పరిష్కారం కూడా తీసుకుంటానిని హామి ఇవ్వడంతో అప్పటి కరసేవను విరమించుకున్నారు.
గడువు పూర్తైయిన దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో అదే యేడాది అక్టోబర్ 30న కరసేవ చేయాలని విశ్వ హిందూ పరిషత్ నిర్ణయం తీసుకుంది. అప్పట్లో అద్వానీ హిందీలో వస్తోన్న ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వీపీ సింగ్ ప్రభుత్వం కరసేవను అడ్డుకుంటే భారత దేశంలో ఎన్నడూ జరగని ప్రజా ఉద్యమం జరగుతుందని హెచ్చరించారు.

అక్టోబర్ 30న అయోధ్యలో వీహెచ్‌పీ తలపెట్టిన కార్యక్రమానికి బీజేపీ తన వంతు మద్దతు ఇచ్చారు. అప్పుడు గుజరాత్‌లోని సోమనాథ్‌ నుంచి అయోధ్యకు పాదయాత్ర చేయాలని సంకల్పించారు. కానీ అప్పటి బీజేపీ ప్రధాన కార్యదర్శి ప్రమోద్ మహాజన్ చేసిన సూచన మేరకు రథయాత్ర చేయాలని సంకల్పించారు. రామ మందిర నిర్మాణం కోసం తలపెట్టిన ఈ యాత్రకు పవిత్రమైన రథయాత్ర పేరు పెట్టారు. సెప్టెంబర్ 12న 1990 రథయాత్రపై ప్రకటన చేసారు. సెప్టెంబర్ 25 దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి రోజున సోమనాథ్ నుంచి ఈ యాత్రను మొదలుపెట్టారు. అక్టోబర్ 30న అయోధ్యకు ఈ రథయాత్రకు చేరుకోవాలని రూట్ మ్యాప్ సిద్దం చేసుకున్నారు.
రథయాత్రను ఉత్తర భారత దేశానికి పరిమితం కాకుండా.. దక్షిణాదిలో కూడా సాగాలని నిర్ణయించారు. 10 వేల కిలో మీటర్ల మేర సాగే ఈ యాత్ర కోసం ఓ మినీ ట్రక్కును రథం రూపంలో సిద్ధం చేసారు. అప్పటి రథయాత్ర సోమనాథ్ నుంచి మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, హరియాణ, ఢిల్లీ వరకు మొదటి దశ రథయాత్ర రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
రెండో దశలో బెంగాల్ సరిహద్దులో బిహార్ నుంచి ఉత్తర ప్రదేశ్‌లో అయోధ్యకు చేరుకోవాలని రూట్ మ్యాప్ రూపొందించారు.

అద్వానీ ఈ రథయాత్ర కోసం సోమనాథ్ ను ఎంచుకోవడం వెనక పెద్ద రీజనే ఉంది. ఇక్కడ వెలిసిన జ్యోతిర్లింగ ఆలయంపై లెక్కలేనన్ని సార్లు దండయాత్రలు జరిగాయి. మహమ్మద్ గజనీ, అల్లావుద్దీన్ ఖీల్జీ సహా ఎందరో ముష్కరులు సోమనాథ్ ఆలయాన్ని కొల్లగొట్టి ధ్వంసం చేసారు. ఆ తర్వాత అహల్య బాయి హోల్కర్ సహకారంతో అక్కడ మళ్లీ ఆలయాన్ని పునరిద్దరించారు.  ఆ తర్వాత మళ్లీ ధ్వంసం అయింది. ఇక స్వాతంత్య్రం తర్వాత అప్పటి కేంద్ర మంత్రి కే.ఎం.మున్షీ ఇక్కడ ఆలయాన్ని పునరిద్దించారు. దానికి అప్పటి కేంద్ర హోం  మంత్రి సర్ధార్ వల్లభబాయ్ పటేల్ సహాయ సహకారాలు అందించారు. ఆయన సహకారంతో సోమనాథ్ ఆలయం పునర్నించబడింది. ఆ ఆలయ స్పూర్తితో అయోధ్యలో ఆలయ నిర్మాణం జరగాలని అద్వానీ తలపెట్టారు.
 
1990 సెప్టెంబర్ 25వ తేదిన సోమనాథ్‌లోని జోత్యర్లింగానికి పూజల తర్వాత అద్వానీ రథయాత్ర మొదలైంది. ఈ యాత్రలో ఆయన వెంట ప్రస్తుత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెన్నంటే ఉన్నారు. గుజరాత్ లోని 300 కిలోమీటర్ల చొప్పున 600 పైగా గ్రామాల్లో ఈ రథయాత్ర కొనసాగింది. అప్పట్లో అద్వానీ ప్రసంగం వినడానికి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చేవారు. అప్పట్లో రోజుకు 25 నుంచి 30 ప్రసంగాలు చేసేవారు.

అప్పటి అద్వానీ రథయాత్రకు వస్తోన్న స్పందన చూసిన నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టించాయి. ప్రధాన మంత్రి విపీ సింగ్ సమస్యకు పరిష్కారం దిశగా కొంత ప్రయత్నం చేసినా.. అప్పుడు ఆయన పార్టీలోని ముఖ్యనాయకులైన అప్పటి యూపీ సీఎం ములాయం సింగ్ యాదవ్, బీహార్ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సాగనివ్వలేదు. ఒకవైపు అద్వానీ రథయాత్ర కొనసాగుతూ ఉండగానే వీపీ సింగ్ నుంచి సానుకూల ప్రకటన చేయించే ప్రయత్నాలు జరిగాయి.

యాత్ర కొనసాగుతున్న టైమ్‌లోనే అక్టోబర్ 15న ఢిల్లీలోని బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశమైంది. ఒకవేళ అయోధ్యలో రామాలయ నిర్మాణానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోతే వీపీ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించింది. అది దీపావళి టైమ్. అద్వానీ అప్పటికే తొలి దశ రథయాత్ర పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కొంత గ్యాప్‌లో ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్‌లో కోల్‌కతా వెళ్లారు. ఆ తర్వాత బిహార్‌లోని ధన్‌బాద్ నుంచి అయోధ్యకు అద్వానీ చేరుకోవాల్సి ఉంది.
 ఈ సమయంలోనే అప్పటి ప్రధాన మంత్రి వీపీ సింగ్.. అద్వానీని పిలిచారు. సమస్యకు సానుకూల పరిష్కారం చూపుతాననే రీతిలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత అక్టోబర్ 21న జరగిన కేబినేట్ సమావేశంలో అయోధ్యకు భూ బదలాంపుపై ఆర్డినెన్స్ తీసుకొచ్చారు. ఆ తర్వాత యూపీ సీం ములాయం సింగ్ యాదవ్ హెచ్చరికతో దాన్ని ఉపసంహరించుకున్నారు. ఈ నిర్ణయం అద్వానీతో పాటు రామ భక్తులకు తీవ్ర నిరాశకు గురిచేసింది.

ఆ తర్వాత అద్వానీ.. వీపీ సింగ్ హెచ్చరికను ఖాతరు చేయకుండా తన రథయాత్రను కొనసాగించారు. ఇక రథయాత్ర అక్టోబర్ 24న తేదిన యూపీలోని దేవర్యాలో ప్రవేశించాల్సి ఉంది. అంతకు ముందు రోజు రాత్రి అక్టోబర్ 23న సమస్తిపూర్‌లో రథయాత్రను లాలు ప్రసాద్ యాదవ్  ప్రభుత్వం అడ్డుకుంది. అటు రథయాత్రికుడు అద్వానీజీని బెంగాల్, బిహార్ సరిహద్దులోని దుమ్కా (ప్రెసెంట్ జార్ఘండ్ లో ఉంది) లోని ఇరిగేషన్ శాఖ బంగ్లాలో నిర్భంధించారు. ఈ ఘటన తర్వాత బీజేపీ అప్పటి నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి తన మద్దతు ఉపసంహరించుకుంది. దీంతో లోక్‌సభలో వీపీ సింగ్ ప్రభుత్వం విశ్వాసం కోల్పోయి ప్రభుత్వం పడిపోయింది.
ముఖ్యంగా అద్వానీ రథయాత్ర దేశ రాజకీయాలను తీవ్రంగా ప్రభావం చూపించింది. ప్రజల్లో జాతీయ భావాలను పురిగొల్పింది. వీపీ సింగ్ తర్వాత చంద్ర శేఖర్ ప్రధాని అయ్యారు. ఆ తర్వాత ఆయన ప్రభుత్వం కొన్ని నెలల్లోనే కుప్పకూలిపోయింది. వీపీ సింగ్‌తో పోలిస్తే.. చంద్రశేఖర్.. అయోధ్య రామ మందర నిర్మాణానికి కొంత చిత్తశుద్ధితో కృషి చేశారాని అద్వానీ తన ఆత్మకథలో పేర్కొన్నారు.

చంద్ర శేఖర్ ప్రభుత్వ పతనం తర్వాత 1991 లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. అయోధ్య అంశం దేశాన్ని ప్రభావితం చేయడంతో బీజేపీ ఆ ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమనుకున్నారు. కానీ మే 20న జరిగిన అప్పటి తొలి విడత పోలింగ్ తర్వాత తమిళనాడులోని పెరంబదూర్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజీవ్ గాంధీని ఎల్‌టీటీ ఆత్మాహుతి దాడిలో ప్రాణాలు కోల్పోయారు.ఆ తర్వాత జూన్ 12, 15 తేదిల్లో తదుపరి దశ ఎన్నికలు జరిగాయి. తొలి విడతలో జరిగిన 211 లోక్‌సభ సీట్లలో బీజేపీ గణనీయంగా సీట్లను సాధించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రాజీవ్ గాంధీ హత్యానంతరం సానుభూతి పవనాలు వీటి కాంగ్రెస్ కు మెజారిటీ సీట్లు గెలుచుకుంది. కానీ ప్రభుత్వానికి సరిపడా సీట్లు రాకపోయినా.. మైనారిటీ గవర్నమెంట్‌ను పీవీ నరసింహరావు నేతృత్వంలో ఏర్పాటైంది. మొత్తంగా డిసెంబర్ 6న అయోధ్యలోని  వివాదాస్పద కట్టడం కూలిపోవడం. ప్రస్తుతం అక్కడ బాలరాముడు కొలువు తీరడం వెనక .. అద్వానీ రథయాత్ర కీలక పాత్ర పోషించిందనే చెప్పాలి.

Also Read: Shoaib Malik Third Marriage: సానియా మీర్జాకు భారీ షాక్.. మళ్లీ పెళ్లి చేసుకున్న భర్త షోయబ్ మాలిక్

Also Read: TANA Elections: సంచలనం రేపిన 'తానా' ఎన్నికల్లో కొడాలి నరేన్‌ జయభేరి.. విజేతలు ఎవరెవరంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News