India Vs China at Ladakh: లఢఖ్‌లోని లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ ( Line Of Actual Control ) వద్ద భారత్ చైనా మధ్య టెన్షన్ రానున్న రోజుల్లో మరింతగా పెరిగే అవకాశం ఉంది.
న్యూ ఢిల్లీ: ఇండో చైనా సరిహద్దుపై ( LAC) పై మొహరించి ఉన్న భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చేశారు. డ్రాగన్‌కు ధీటైన సమాధానం చెప్పేందుకు వీలుగా 3 వేల 5 వందల కిలోమీటర్ల సరిహద్దుపై ఉన్న సైన్యానికి ఈ స్వేఛ్చనిస్తూ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ ( Defence Minister Rajnath Singh) అధ్యక్షతన జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో ( High level review meeting) నిర్ణయం తీసుకున్నారు.
గాల్వన్ లోయ వివాదం ఘటనలో కొంత మంది భారత సైనికులు, ఉన్నతాధికారులను చైనా బంధించింది. అయితే చైనాతో ఉన్నతాధికారులు మూడుసార్లు భేటీ ఫలితంగా 10 మంది భారత జవాన్లు వారి చెర నుంచి విముక్తి పొందారు. భారత్, చైనాల మధ్య పరిస్థితులు అదుపు తప్పుతున్నాయి.
భారత్ - చైనా సరిహద్దుల్లో చైనా బలగాలతో హోరాహోరి తలపడి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుడు.. తెలుగు నేలపై పుట్టిన భరత మాత ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు అంతిమ యాత్రలో ప్రముఖులు, ప్రజానికం భారీ సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్లు సంతోష్ బాబు నినాదాలతో సూర్యాపేట మార్మోగింది.భరత మాత ముద్దు బిడ్డ సంతోష్ బాబుకు ఘన నివాళి అర్పించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చిన జనంతో సూర్యాపేట జన సంద్రమైంది.
Indian Army | న్యూ ఢిల్లీ: చైనా బలగాలతో తూర్పు లడాఖ్‌లోని గల్వన్ లోయలో సోమవారం రాత్రి జరిగిన హోరాహోరీపై భారత ఆర్మీ స్పందించింది. చైనాతో ఘర్షణపై మంగళవారం సాయంత్రం ఇండియన్ ఆర్మీ స్పందిస్తూ.. "దేశ సమగ్రతను, సార్వభౌమత్వాన్ని కాపాడటానికి భారత సైన్యం ఎల్లవేళలా కృషి చేస్తుంది, ఎంతటి పోరాటమైనా చేస్తుంది" అని స్పష్టంచేసింది.
Colonel Santosh Babu | న్యూ ఢిల్లీ: చైనా సైన్యం మరోసారి రెచ్చిపోయింది. స్నేహహస్తం చాచినట్టు నటిస్తూనే భారత సైనికులను దొంగ దెబ్బ కొట్టింది. తూర్పు లద్దాక్‌లోని గల్వన్ లోయలో భారత బలగాలపై దాడికి తెగబడిన చైనా.. 20 మంది భారత సైనికులను పొట్టనపెట్టుకుంది. చైనా బలగాలతో ( Chinese troops ) జరిగిన హోరాహోరి పోరాటంలో 20 మంది భారత సైనికులు వీర మరణం పొందినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.