Mallareddy Revanth Reddy Appointment: తన భూమి కబ్జా విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. తన భూమిని కబ్జా చేసినవారికి పోలీసులు, ప్రభుత్వ అధికారులు అండగా నిలుస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయమై రేవంత్ రెడ్డితో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మల్లారెడ్డికి రేవంత్ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు.
Jr NTR Flat Dispute Case In Telangana High Court: సినీ నటుడు నందమూరి తారక రామారావు స్థల వివాదంలో చిక్కుకున్నారు. సుంకు గీత అనే మహిళ నుంచి జూబ్లీహిల్స్ కొనుగోలు చేసిన ప్లాట్ విషయంలో వివాదం ఏర్పడింది. ఈ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరగగా.. న్యాయస్థానం విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది.
Khamma land Fight: ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కోనాయిగూడెంలో భూవివాదం నెలకొంది. ఈక్రమంలోనే పుల్లమ్మ అనే మహిళపై నేలకొండపల్లి సోసైటీ ఛైర్మన్ కోటి సైదారెడ్డి దాడికి పాల్పడ్డాడు. మహిళను కింద పడేసి కాలుతో తన్న విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. ఘటనతో తీవ్రంగా గాయపడ్డ మహిళను ఆస్పత్రికి తరలించారు. దాడిపై స్థానిక పీఎస్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
Gunfire in siddipeta: సిద్ధిపేట జిల్లాలో మరోసారి కాల్పులు కలకలం జరిగింది. తొగుట మండలం రాంపూర్ శివారులో ఒగ్గు తిరుపతి అనుచరులు ఆకుల వంశీపై కాల్పులకు పాల్పడ్డారు.
Family of 4 Murdered Daughter Gangraped : మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన యూపీలోని అలహాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. భూవివాదం నేపధ్యంలో దళిత కుటుంబానికి చెందిన 50 ఏళ్ల యజమాని, 47 ఏళ్ల ఆయన భార్యను, 17 ఏళ్ల కుమార్తెను, 10 ఏళ్ల కొడుకుని నిందితులు చంపేశారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.