తెలంగాణ ( Telangana ) రాష్ట్ర కొత్త సచివాలయం ఎలా ఉండబోతోంది? ఇప్పటికే మీడియాలో వైరల్ అవుతున్న మోడల్ కు ఆమోదం లభిస్తుందా లేదా కొత్తది సిద్ధమవతుందా? కొత్త సచివాలయం ( New Secretariat ) డిజైన్ ప్రదానాంశంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కీలకమైన సమీక్ష( KCR Review ) నిర్వహించనున్నారు.
తెలంగాణ సచివాలయం ( Telangana Secretariat ) కూల్చివేతలో ఎదురైన కోర్టు ఇబ్బందులన్నీ తొలగిపోవడంతో ఆ పనులు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పుడు అదే ప్రాంతంలో నిర్మించబోతున్న కొత్త సచివాలయ డిజైన్ ( New Secretariat Design ) ఎలా ఉండనుందనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే నూతన సచివాలయ డిజైన్ ఒకటి మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపధ్యంలో మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( Telangana Cm KCR ) కీలకమైన సమీక్ష ( Review ) నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో ప్రధానంగా కొత్త సచివాలయ డిజైన్ పై చర్చ జరగనుంది. పాత సచివాలయం కూల్చివేత పనులు, కొత్త సెక్రటేరియన్ నిర్మాణంపై ఆర్ అండ్ బి అధికార్లతో సమీక్షించనున్నారు. మరోవైపు ఇటీవల వివాదాస్పదమవుతున్న ఉస్మానియా ఆసుపత్రి ( Osmania University ) విషయంలో కూడా కేసీఆర్ ఓ నిర్ణయం తీసుకోనున్నారు. Also read:Telangana: ఇదే చివరి అవకాశం, ప్రభుత్వానికి సీరియస్ వార్నింగ్ ఇచ్చిన హైకోర్టు