బుధవారం గుంటూరులో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత హోదాలో మాట్లాడుతూ.. తెలంగాణ నలుమూలల నుంచి వచ్చిన తన అభిమానులు, పార్టీ కార్యకర్తలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.
సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేతృత్వంలో ఏర్పడిన జాయింట్ ఫ్యాక్ట్స్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్సీ) శనివారం సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
పవన్ కల్యాణ్ మూడో రోజు 'చలో చలో చలోరే' ప్రజాయాత్ర కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం తన అభిమానులతో కలిసి ఆయన కొత్తగూడెం నుంచి ఖమ్మం ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యంలోని దంతాలపల్లిలో కాసేపు సేదదీరారు. పవన్ ఆగిన విషయాన్ని పసిగట్టిన స్థానికులు ఆయన్ను చూసేందుకు ఎగబడ్డారు. ఆయనతో సెల్ఫీ దిగేందుకు ఉత్సాహం చూపించారు. కాగా పవన్ వారితో పవన్ కాసేపు మాట్లాడి సెల్ఫీలకు ఫోజులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఓ స్థానిక యువకుడు పవన్ తో మాట్లాడుతూ..అన్న తెలంగాణలో మీకు భారీగా అభిమానులు ఉన్నారని చెప్పడంతో చిరునవ్వు నవ్వారు. అనంతరం పవన్ కల్యాణ్ తన ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించారు.
రాజకీయాలకు పూర్తి సమయం కేటాయించాలని భావిస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ..ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కాగా గతంలో చెప్పినట్లుగా జనసేన తొలి పార్టీ ఆఫీసు అనంతపురంలో ఏర్పాటు చేస్తామని పవన్ ప్రకటించారు. గుత్తి రోడ్డులో రెండెకరాల విస్తీర్ణంలో కార్యాలయం ఏర్పాటు కాబోతుందని పవన్ తెలిపారు. తన పార్టీ ఆఫీస్ విజ్ఞాన భాండాగారం తీర్చిదిద్దుతానని..అది మేథావుల చర్చలకు కేంద్రంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.