PF Account Withdrawal Limit Increased: ఈఫీఎఫ్ ఖాతాదారులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) నుంచి విత్ డ్రాపై కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఒకేసారి రూ.లక్ష వరకు విత్ డ్రా చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇప్పటివరకు కేవలం రూ.50 వేల వరకు మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు రూ.లక్షకు పెంచినట్లు మంత్రి వెల్లడించారు. మారుతున్న వినియోగాలకు అనుగుణంగా లిమిట్ పెంచినట్లు చెప్పారు. దీంతో పీఎఫ్ ఖాతాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
EPFO Updates: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్మెంట్ తరువాత ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా జీవితాన్ని సాఫీగా గడిపేందుకు ఇన్వెస్ట్మెంట్ కమ్ రిటైర్మెంట్ స్కీమ్ EPFని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అమలు చేస్తోంది. ప్రస్తుతం డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు ప్రతి నెలా వారి బేసిక్ పే జీతంలో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యజమాని సహకారం కూడా 12 శాతం ఉంటుంది. ఉద్యోగులు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)ని ఎంచుకుంటే.. మరింత ఎక్కువ కంట్రీబ్యూషన్ చేసుకోవచ్చు. రూ.3.3 కోట్లు కార్పస్‌ను ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందా..
EPFO Minimum Pension: ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)తో ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ ఉంటుంది. ఈ పథకం కింద 25 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులకు పదవీ విరమణకు ముందు చివరి 12 నెలలలో పొందిన సగటు ప్రాథమిక జీతంలో 50 శాతానికి సమానమైన పెన్షన్‌ను అందుకుంటారు. ఈ స్కీమ్ ఏప్రిల్ 1, 2025 నుంచి అమలులోకి వస్తుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కింద ఉన్న ప్రైవేట్ ఉద్యోగుల పెన్షన్ పథకం (ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్) కింద నెలవారీ కనీస పెన్షన్‌ను పెంచాలనే డిమాండ్ చేస్తున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.