EPFO Updates: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రిటైర్‌మెంట్ తరువాత ఎలాంటి ఆర్థిక కష్టాలు లేకుండా జీవితాన్ని సాఫీగా గడిపేందుకు ఇన్వెస్ట్‌మెంట్ కమ్ రిటైర్‌మెంట్ స్కీమ్ EPFని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) అమలు చేస్తోంది. ప్రస్తుతం డిపాజిట్లపై 8.25 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈపీఎఫ్‌ఓ నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు ప్రతి నెలా వారి బేసిక్ పే జీతంలో 12 శాతం ఈపీఎఫ్ ఖాతాలో జమ అవుతుంది. యజమాని సహకారం కూడా 12 శాతం ఉంటుంది. ఉద్యోగులు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్ (VPF)ని ఎంచుకుంటే.. మరింత ఎక్కువ కంట్రీబ్యూషన్ చేసుకోవచ్చు. రూ.3.3 కోట్లు కార్పస్‌ను ఎలా పొందవచ్చో ఇక్కడ తెలుసుకుందా..
ఉద్యోగులు వారి పదవీ విరమణ పొదుపులను మెరుగుపరిచుకునేందుకు, పీఎఫ్‌ఫై డిపాజిట్లపై పొందే వడ్డీ రేటును పొందేందుకు వీపీఎఫ్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఈపీఎఫ్ మాదిరే.. వీపీఎఫ్‌లో జమ చేసే విరాళాలపై వడ్డీ ప్రయోజనం ఉంటుంది.
వీపీఎఫ్ సబ్‌స్క్రైబర్‌లు తప్పనిసరిగా ఐదేళ్ల కనీస పదవీకాలం పూర్తి చేస్తేనే ట్యాక్స్‌రహిత విత్‌డ్రా చేసుకోవచ్చు. పదవీ విరమణ, రాజీనామా లేదా ఖాతాదారు మరణించిన సందర్భంలో నామినీకి EPF లాగానే VPF లో డబ్బులు అందజేస్తారు.
వైద్య ఖర్చులు, వివాహం, విద్య లేదా ఆస్తి కొనుగోళ్లు వంటి ఆర్థిక అవసరాలలో వీపీఎఫ్ నుంచి డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.
గతంలో ఈపీఎఫ్‌పై వచ్చే వడ్డీ మొత్తం పన్ను రహితంగా ఉండేది. అయితే ప్రస్తుతం రూల్స్ మార్చారు. ఒక సంవత్సరంలో రూ.2.5 లక్షల వరకు పొందే వడ్డీ పన్ను రహితంగా ఉంటుంది. ఈ రూ.2.5 లక్షల లిమిట్ EPF, VPF రెండింటినీ వర్తిస్తుంది.
ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ.1.5 లక్షల కంట్రీబ్యూషన్ వరకు ఈపీఎఫ్ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపులకు అర్హులు. అయితే ఉద్యోగులు ఎక్స్‌ట్రా ట్యాక్స్ లేకుండా VPFకి ఏడాదికి రూ. 2.5 లక్షల వరకు కంట్రీబ్యూట్ చేయవచ్చు. ప్రావిడెంట్ ఫండ్ నుంచి విత్ డ్రా, మెచ్యూరిటీ మొత్తం కూడా పన్ను రహితంగా ఉంటుంది.
ఈపీఎఫ్, VPFలో ఏడాదికి మొత్తం రూ.2.5 లక్షలు (నెలకు రూ.20,833) ఇన్వెస్ట్ చేయడం మొదలుపెడితే.. 8.25 శాతం వార్షిక వడ్డీ రేటుతో 30 సంవత్సరాలలో దాదాపు రూ.3.3 కోట్లు పొందుతారు. 20 ఏళ్లలో కార్పస్ రూ.1.27 కోట్లు అవుతుంది.
వీపీఎఫ్‌లో ఎక్కువకాలం ఇన్వెస్ట్ చేస్తూ.. విత్ డ్రా చేయకుండా అలానే ఉంటే కార్పస్ ఎక్కువ మొత్తంలో అవుతుంది. వీపీఎఫ్‌లో ఎక్కువ కంట్రీబ్యూట్ చేయాలంటే.. మీరు ఖర్చులను బాగా తగ్గించుకుని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.