Tamil nadu: తమిళనాట ఎన్నికల వేడి రాజుకుంది. ఓ వైపు అధికార విపక్ష పార్టీలు..మరోవైపు కమల్ హాసన్. ఇంకోవైపు రజనీకాంత్. ఎవరు ఎవరితో జత కడతారో ఇంకా తెలియకపోయినా..కమల్ హాసన్ చేసి వ్యాఖ్యలు మాత్రం ఆసక్తి రేపుతున్నాయి.
Rajnikanth: తమిళనాట కీలక పరిణామాలు రేపు చోటుచేసుకోనున్నాయి. తమిళ ఆరాధ్య నటుడు రేపు తీసుకోబోయే నిర్ణయంపై రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు మారవచ్చు. అందుకే అందరి దృష్టి ఇప్పుడు తమిళనాడుపై పడింది.
తమిళనాట ఎన్నికల సందడి ప్రారంభమైంది. అధికార పార్టీ ఏఐఏడీఎంకే, ప్రతిపక్ష డీఎంకేతో పాటు సినీ నటుడు కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎం సైతం బరిలో నిలవనుంది. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేతో పొత్తు ఉంటుందా లేదా అనే విషయంపై కమల్ హాసన్ స్పష్టత ఇచ్చేశారు.
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజురోజుకూ విస్తరిస్తూనే ఉంది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడి మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి సైతం కరోనాబారిన పడి కన్నుమూశారు.
ఎంపీ కనిమొళికి చేదు అనుభవం ఎదురైంది. హిందీలో మాట్లాడనందుకు సీఐఎస్ఎఫ్కు చెందిన ఓ మహిళా అధికారి తనను ‘మీరు భారతీయులేనా?’ అని ప్రశ్నించారని మహిళా ఎంపీ కనిమొళి (DMK MP Kanimozhi) తెలిపారు.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యం క్షిణిస్తోందని కావేరి ఆస్పత్రి వర్గాలు మంగళవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. ఇప్పటికే కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరి ఆస్పత్రితోపాటు గోపాలపురంలో ఉన్న కరుణానిధి నివాసం ఎదుట సైతం భారీ భద్రత ఏర్పాటు చేసింది ఆ రాష్ట్ర సర్కార్.
తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ఒక వెన్నెముక లేని పార్టీ అని.. అందుకే కేంద్ర ప్రభుత్వంపై తెలుగుదేశం అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు సహకారం అందించలేదని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ తెలిపారు. బీజేపీ కనుసన్నల్లో నడిచే తొత్తుగా అన్నాడీఎంకే వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.