Earthquake In Delhi: మంగళవారం ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ భూకంపం సంభవించింది. ఈ భూకంపం ధాటికి ఉత్తర భారతంతోపాటు పాకిస్తాన్ లోని పలు నగరాలు వణికాయి. ఈ ఘటనలో 9 మంది మృతి చెందారు.
దేశంలో కరోనావైరస్ (Coronavirus) మహమ్మారి వ్యాప్తి తీవ్రరూపం దాలుస్తుండటంతో.. దీపావళి పర్వదినాన (deepavali 2020) టపాసులు కాల్చడంపై ఇప్పటికే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తెలంగాణ (Telangana) లో కూడా దీపావళి టపాసులను (Firecrackers Ban) ఖచ్చితంగా నిషేధించాలని హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది.
ప్రతీ ఏడాది దీపావళి (deepavali 2020) పర్వదినం కోసం భారతీయులంతా ముందుస్తుగానే సిద్ధం అవుతుంటారు. అయితే కరోనా (Coronavirus) మహమ్మారి వ్యాప్తి నానాటికీ పెరుగుతుండటంతో.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను మరింత దిగజారుతాయని గమనించి కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే టపాసులు కాల్చడంపై నిషేధం (Diwali Firecrackers ban) విధిస్తూ చర్యలు తీసుకున్నాయి.
Dust storm in Delhi | న్యూ ఢిల్లీ: భారీ ఉష్ణోగ్రతలతో భగభగ మండుతున్న ఢిల్లీ వాతావరణం బుధవారం సాయంత్రం కురిసిన జల్లులతో ఒక్కసారిగా చల్లబడింది. అయితే, అంతకంటే ముందుగా ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంత పరిసరాల్లో ( Delhi-NCR) దుమ్ము తుఫాన్ విరుచుకుపడింది. దుమ్ము తుఫాను వెంటే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కుండపోతగా కురిసింది.
దీపావళి సందర్భంగా దేశ రాజధానిలో బాణసంచా పేల్చడంపై నిషేధాన్ని ప్రకటించిన సుప్రీంకోర్టు తీర్పుపై ప్రముఖ యోగా శిక్షకులు బాబా రామ్‌దేవ్ స్పందించారు. ఈ తీర్పు ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు ఉందని విమర్శించారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి తీర్పు ఇవ్వడం, హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, హింద పర్వదినాలపై నిషేదం విధించడం సరైన పద్ధతి కాదన్నారు. అదేవిధంగా ఈ నిషేదం పట్ల సుముఖత వ్యక్తం చేసిన కాంగ్రెసు నాయకుడు శశిథరూర్‌పై కూడా రామ్‌దేవ్ విరుచుకుపడ్డారు. థరూర్ లాంటి మేధావులు ఇలాంటి తీర్పులను సమర్థించడం మంచిది కాదన్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.