బాణాసంచా నిషేధాన్ని సమర్థించను..!

Last Updated : Oct 12, 2017, 07:35 PM IST
బాణాసంచా నిషేధాన్ని సమర్థించను..!

దీపావళి సందర్భంగా దేశ రాజధానిలో బాణసంచా పేల్చడంపై నిషేధాన్ని ప్రకటించిన సుప్రీంకోర్టు తీర్పుపై ప్రముఖ యోగా శిక్షకులు బాబా రామ్‌దేవ్‌ స్పందించారు. ఈ తీర్పు ఒక వర్గాన్ని టార్గెట్ చేసినట్లు ఉందని విమర్శించారు. హిందువులను లక్ష్యంగా చేసుకొని ఇలాంటి తీర్పు ఇవ్వడం, హిందువుల మనోభావాలను దెబ్బతీయడం, హింద పర్వదినాలపై నిషేదం విధించడం సరైన పద్ధతి కాదన్నారు.  అదేవిధంగా ఈ నిషేదం పట్ల సుముఖత వ్యక్తం చేసిన కాంగ్రెసు నాయకుడు శశిథరూర్‌పై కూడా రామ్‌దేవ్ విరుచుకుపడ్డారు. థరూర్ లాంటి మేధావులు ఇలాంటి తీర్పులను సమర్థించడం  మంచిది కాదన్నారు. ఢిల్లీలో ఈ సంవత్సరం మందుగుండు సామగ్రి విక్రయాలపై నిషేధం విధిస్తూ భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పును వెలువరించింది. 

Trending News