భారత్లో కరోనా వైరస్ (Coronavirus) కేసులు నానాటికి పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదవుతూనే ఉంది. ఈ క్రమంలో హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ (Bharat Biotech) సంస్థ భారతదేశపు మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్ ‘కోవ్యాక్సిన్’ (Covaxin) కు సంబంధించి కీలక విషయాన్ని శుక్రవారం వెల్లడించింది.
దేశంలో కరోనా వైరస్ బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మరోవైపు కోవిడ్ 19 ను అరికట్టేందుకు వ్యాక్సిన్ పై పరిశోధనలు వేగవంతమవుతున్నాయి. వ్యాక్సిన్ పరిశోధనలో క్లినికల్ ట్రయల్స్ అనేవి అత్యంత ప్రాధాన్యత కలవి. ఇవి విజయవంతమైతేనే వ్యాక్సిన్ మార్కెట్ లో అందుబాటులో వస్తుంది. ఇటీవల ఓ భారతదేశ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కు డీసీజీఐ సైతం అనుమతిచ్చింది. ఇందులో భాగంగా ఎంపికైన నిమ్స్ లో జూలై 7 నుంచి వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించనున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.