దుబాయ్ నుంచి వ్యక్తిగత కారణాలతో భారత్‌కు తిరిగొచ్చేసి షాకిచ్చాడు సురేష్ రైనా (Suresh Raina Out from IPL 2020). దీంతో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings) రైనా సేవల్ని కోల్పోయింది. రైనా వస్తాడని ఆశలు పెట్టుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది.
`CSK vs DC match review: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి ( MS Dhoni ) మళ్లీ ట్రబుల్స్ మొదలయ్యాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఐపిఎల్ టోర్నమెంట్లో వరుసగా రెండో మ్యాచ్ కూడా ఓడిపోయింది. ఐపిఎల్ 2020 ఆరంభ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians ) జట్టుపై ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super kings ) జట్టుకు ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ ఓటమే మిగిలింది.
IPL 2020లో భాగంగా రాజస్తాన్ రాయల్స్‌పై జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) 16 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఓవైపు రాజస్థాన్ రాయల్స్ ( RR ) విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సిన అవసరం ఉందని తెలిసినా.. సిఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోని 7వ స్థానంలో బ్యాటింగ్‌కు ( MS Dhoni ) రావడం ఏంటంటూ ధోనీపై సీనియర్ క్రికెటర్స్ నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి.
ఓపెనింగ్ బ్యాట్స్ మెన్ పృథ్వీ షా అద్భుతమైన అర్థసెంచరీతో రాణించడంతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals ) బౌలర్లు అదరొట్టేయడంతో మహేంద్ర సింగ్ ధోనీ ( Mahendra Singh Dhoni ) సారథ్యం వహిస్తున్న చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ కోల్పోవాల్సి వచ్చింది.
ఐపీఎల్ 2020లో భాగంగా షార్జా క్రికెట్ స్టేడియంలో రాజస్తాన్ రాయల్స్ ( Rajasthan Royals ), చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో చెన్నైపై రాజస్థాన్ 16 పరుగుల తేడాతో గెలిచి తన సత్తా చాటుకుంది. టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టు కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో రాజస్థాన్ రాయల్స్ తొలుత బ్యాటింగ్‌కి దిగింది.
ఐపిఎల్ 2020 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) జట్టు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు స్కోర్ చేసింది.
రాయుడు ఇన్నింగ్స్ చూసిన నెటిజన్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ( MSK Prasad Trolled)పై మండిపడుతున్నారు. ఎమ్మెస్కేను ఓ రేంజ్లో 3D ట్రోలింగ్ చేస్తున్నారు.
MS Dhoni Funny Comments: చాలా కాలం తర్వాత ఎంఎస్ ధోనీ మైదానంలో కనిపించి తన అభిమానులలో నూతనోత్సాహాన్ని నింపాడు. ధోనీ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందే తనదైన మార్క్ పంచ్ విసిరాడు. కీపర్లకు సోషల్ డిస్టెన్సింగ్‌పై ధోనీ పేల్చిన జోక్ వైరల్ అవుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. చెన్నై జట్టుకు 100వ విజయాన్ని అందించిన కెప్టెన్ (MS Dhoni records 100 wins as captain for CSK) అయ్యాడు ధోనీ. ఓ ఫ్రాంచైజీ తరఫునగానీ, లేక ఓవరాల్ ఐపీఎల్‌లోగానీ 100 విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్ ధోనీనే.
ఐపీఎల్ 2020లో భాగంగా శనివారం అబూధాబీలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ( MI vs CSK opening match IPL 2020 ) మధ్య జరిగిన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై చెన్నై సూపర్ కింగ్స్ ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
IPL 2020 కోసం లాంగ్ గ్యాప్ తర్వాత మైదానంలో అడుగుపెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీ తన న్యూ లుక్‌తో ( MS Dhoni's new look ) అభిమానులను ఆకట్టుకున్నాడు. ఐపిఎల్ 2020 ఓపెనింగ్ మ్యాచ్‌లో ( MI vs CSK opening match IPL 2020 ) ముంబై ఇండియన్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడగా.. ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని అవతారమే ప్రత్యేకంగా నిలిచింది.
IPLలో ఉత్తమ ఆటగాడిగా, కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Mumbai Indians Captain Rohit Sharma) విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. క్రిస్ లిన్‌ను ఓపెనింగ్‌లో పంపించి రోహిత్ వన్‌డౌన్, లేక సెకండ్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగుతాడని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంబరం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) రేపటి (సెప్టెంబర్ 19) నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబై, చెన్నై (Mumbai Indians vs Chennai Super Kings) మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌కు అబు దాబి వేదికగా మారింది.
ఐపీఎల్ 2020 ప్రారంభానికి ఇంకా కొన్నిగంటల సమయం మాత్రమే ఉంది. ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో పలు జట్లన్నీ సంసిద్దమయ్యాయి. ఈ క్రమంలో ప్రారంభానికి ముందే.. కరోనావైరస్తో, పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఫెవరెట్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ - 2020 సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల ముందే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు దెబ్బ దెబ్బ తగులుతోంది. ఇప్పటికే సీఎస్కే జట్టులో ఇద్దరు ఆటగాళ్లు, 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. దీంతోపాటు స్టార్ క్రికెటర్ సురేశ్ రైనా సైతం వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి ( CSK players ) గుడ్ న్యూస్. గత వారం కరోనాతో పాటు వివిధ ఇతర సమస్యలతో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు తాజాగా జరిగిన కరోనా పరీక్షల్లో ( COVID-19 tests ) భారీ ఊరట లభించింది.
CSK జట్టులో కరోనా కలకలం రేపుతోంది. సిబ్బందితో పాటు ఆటగాళ్లకు కలిపి మొత్తం 13 మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆసీస్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ (Josh Hazlewood) ఆందోళన చెందుతున్నాడు.
ఐపీఎల్ 2020 ప్రారంభానికి ముందు కరోనావైరస్ మహమ్మారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టును అతలాకుతలం చేస్తోంది. ఐపీఎల్ కోసం దుబాయ్ చేరుకున్న ఆ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఐపీఎల్ 2020 కోసం ఉత్సాహంగా దుబాయ్‌లో అడుగు పెట్టిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) కు ఆదిలోనే పెద్ద షాక్ తగిలింది. ఆగస్టు 15న మహేంద్ర సింగ్ ధోనితో కలిసి అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన సురేష్ రైనా (Suresh Raina).. ఐపీఎల్ టోర్నీకీ సైతం దూరమయ్యాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.