IPL 2020లో ఆ ఫస్ట్ రికార్డు Rajasthan Royals సొంతం

ఐపిఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) జట్టు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌‌కి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు స్కోర్ చేసింది.

Last Updated : Sep 22, 2020, 11:47 PM IST
IPL 2020లో ఆ ఫస్ట్ రికార్డు Rajasthan Royals సొంతం

ఐపిఎల్ 2020 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ ( Rajasthan Royals ) జట్టు ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా మంగళవారం చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) జట్టుతో జరుగుతున్న మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌‌కి దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు స్కోర్ చేసింది. ఐతే ఈ సీజన్‌లో ఇదివరకు మూడు మ్యాచ్‌లు జరగగా ఇలా స్కోర్‌ని ఇప్పటివరకు 200 మార్క్ దాటించిన టీమ్ ఏదీ లేకపోవడంతో ఆ రికార్డు రాజస్థాన్ రాయల్స్ వశమైంది. ఇకపై జరిగే మ్యాచుల్లో స్కోర్ 200 మార్క్ దాటించే జట్లు ఎన్నో ఉంటుండొచ్చు కానీ మొట్టమొదట IPL 2020లో ఆ రికార్డుని సొంతం చేసుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు మాత్రమే. Also read : RR vs CSK match 4 preview: రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ప్రివ్యూ

Rajasthan Royals జట్టు స్కోర్ 200 మార్క్ దాటడంలో వికెట్ కీపర్ సంజు శాంసన్ ( Sanju Samson ) కీలక పాత్ర పోషించాడు. సంజు శాంసన్ కేవలం 32 బంతుల్లో 74 పరుగులు ( 6X9, 4X1) రాబట్టగా మరోవైపు స్కిప్పర్ స్టీవ్ స్మిత్ ( Steve Smith ) సైతం 47 బంతుల్లో 69 పరుగులు ( 6x4, 4x4) రెచ్చిపోయాడు. 19 ఓవర్ చివర్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కోర్ 186/7 వద్ద ఉండగా.. చెన్నై సూపర్ కింగ్స్‌ తరపున సౌతాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి ( Lungi Ngidi ) వేసిన చివరి ఓవర్లో ఇంగ్లండ్ స్పీడ్‌స్టర్ జోఫ్రా ఆర్చర్ ( Jofra Archer ) చెలరేగిపోయాడు. 

Lungi Ngidi వేసిన చివరి ఓవర్లో జోఫ్రా ఆర్చర్ ఏకధాటిగా 4 సిక్సులు బాదాడు. అందులో 2 నో బాల్స్ ( No balls ) కూడా ఉన్నాయి. అలా చివరి ఓవర్లో మరో 30 పరుగులు జోడించి నాటౌట్‌గా నిలిచాడు. ఫలితంగా జట్టు స్కోర్ 200 మైల్ స్టోన్ అధిగమించగలిగింది. ఇప్పటివరకు జరిగిన మూడు మ్యాచుల్లో కూడా 160 అనేది పార్ స్కోర్‌గా ఉంటూ వచ్చిన సంగతి తెలిసిందే. Also read : Andrew Russells: కెమెరాను షేక్ చేసిన రస్సేల్ షాట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News