IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త జెర్సీ చూశారా..?

ఐపీఎల్‌ 2020 ప్రారంభానికి ఇంకా కొన్నిగంటల సమయం మాత్రమే ఉంది. ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో పలు జట్లన్నీ సంసిద్దమయ్యాయి. ఈ క్రమంలో ప్రారంభానికి ముందే.. కరోనావైరస్‌తో, పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఫెవరెట్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్.

Last Updated : Sep 15, 2020, 07:36 PM IST
IPL 2020: చెన్నై సూపర్ కింగ్స్ కొత్త జెర్సీ చూశారా..?

Chennai Super Kings new jersey video: న్యూఢిల్లీ: ఐపీఎల్‌ 2020 ప్రారంభానికి ఇంకా కొన్నిగంటల సమయం మాత్రమే ఉంది. ఎలాగైనా కప్ కొట్టాలన్న కసితో పలు జట్లన్నీ సంసిద్దమయ్యాయి. ఈ క్రమంలో ప్రారంభానికి ముందే.. కరోనావైరస్‌తో, పలువురు ఆటగాళ్లు ఐపీఎల్ సీజన్ నుంచి తప్పుకోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటోంది ఫెవరెట్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings). కీలక ఆటగాళ్లు లేనప్పటికీ.. తమ సత్తా చాటుతాం అంటున్నారు సీఎస్‌కే ఆటగాళ్లు, ప్రాంఛైజీ... దీంతోపాటు ఐపీఎల్ 2020 తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్‌ 19న ముంబైతో తలపడేందుకు సీఎస్‌కే ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు. అయితే.. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ మంగళవారం తమ జెర్సీకి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో ద్వారా అభిమానులతో పంచుకుంది. Also read: CSK In IPL 2020: సీఎస్కేను వీడని కరోనా కష్టాలు

ఈ వీడియో వచ్చిరాగానే.. సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అయితే.. సీఎస్‌కే షేర్ చేసిన ఈ వీడియోలో ఎంఎస్ ధోని, షేన్ వాట్సన్, మురళీ విజయ్ కాలర్‌ ఎగరేస్తూ.. స్టెప్పులేసి మరి అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ వీడియో ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.  Bigg Boss 4: మీ ఫెవరెట్ కంటెస్టెంట్స్‌ ఓటింగ్ నెంబర్స్ ఇవే...

Trending News