Rythu bandhu scheme money | హైదరాబాద్: రైతు బంధు పథకం కింద రైతులకు అందించే పెట్టుబడి సాయం రాష్ట్రంలోని రైతులు అందరికి అందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ ఆర్థిక సహాయం అందజేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బ్యాంక్ ఖాతాలతో ఆధార్ కార్డు నెంబర్ లింక్ చేసుకోని వారి ఖాతాల్లో నగదు జమ కాకపోవడం నిజమేనన్న ఆయన.. అలా ఖాతాలో నగదు జమ కాని వారికి నేరుగానే నగదు అందిస్తామని తెలిపారు.
ఎస్బీఐ కస్టమర్లు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు కేవైసి డాక్యుమెంట్స్ ( KYC documents ) సమర్పించని ఖాతాదారులు ఫిబ్రవరి 28వ తేదీలోగా కేవైసీ పూర్తి చేసుకోవాలని ఎస్బీఐ గడువు విధించింది. అప్పటికీ కేవైసీ పూర్తి చేసుకోని వినియోగదారులు ఎవరైనా ఉంటే.. వారి ఖాతాలను బ్లాక్ చేసేందుకైనా వెనుకాడబోమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) స్పష్టంచేసింది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.