Bandi Sanjay Interesting Comments on Balagam Movie:ఒకపక్క తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను విమర్శిస్తూనే మరోపక్క బలగం సినిమా మీద బండి సంజయ్ ప్రశంసల వర్షం కురిపించారు. మనీ సంబంధాలు తప్ప మానవ సంబంధాలు లేని మూర్ఖుడు కేసీఆర్ అని విమర్శించిన ఆయన రేవంత్ రెడ్డి కూతురు పెళ్లి రోజు, మా అత్తమ్మ పక్షి ముట్టే కార్యక్రమాలు జరగనీయకుండా ఇబ్బందికి గురి చేసిన నీచుడు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఆయనకు బలగం సినిమా చూపిస్తే నైనా కనువిప్పు కలుగుతుందేమో అంటూ బండి సంజయ్ కామెంట్లు చేశారు. నిజానికి ఈ రోజు హైదరాబాద్ సెంట్రల్, సికింద్రాబాద్ మహంకాళి, భాగ్యనగర్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులతో పాటు మరికొందరు కీలక నేతలతో కలిసి బండి సంజయ్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని దేవి థియేటర్ లో బలగం సినిమా వీక్షించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.
Also Read: Akanksha Dubey Death:నటి మృతి కేసు.. సింగర్ అరెస్ట్.. సీసీ ఫుటేజ్ లో ఉన్న ఆ మిస్టరీ మ్యాన్ ఎవరు?
చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా తలుచుకోవాలి? కొలుచుకోవాలి? అనే ఆలోచన లేకుండా పోతున్న ఈ రోజుల్లో 11 రోజుల పాటు దావత్ చేసుకోవడం బాధపడడానికి పరిమితమైన ఆ రోజుల్లో చనిపోయిన వ్యక్తిని ఏ విధంగా కొలవాలి? తలచాలి? అనే భావన మీద సినిమా తీసి మానవ సంబంధాలు కుటుంబ బంధాల గురించి అద్భుతంగా చెప్పిన డైరెక్టర్ వేణుకు హ్యాట్సాఫ్ అని అన్నారు. కేవలం కలెక్షన్లు, పబ్లిసిటీ అని చూడకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను చూసి మంచి సందేశాన్ని అందించేందుకు ప్రయత్నించిన దిల్ రాజు సహా సినిమా యూనిట్ కు తన ప్రత్యేక అభినందనలు తెలిపారు బండి సంజయ్.
థియేటర్‌కు వచ్చి సినిమా చూసి సినిమా పరిశ్రమకు బలం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చే సినిమా చూశానని ఆయన అన్నారు. ఇక మొన్న తన అత్తమ్మ చనిపోతే పక్షిముట్టే కార్యక్రమానికి వెళ్లకుండా వెళుతున్న సమయంలో అకారణంగా అన్యాయంగా అరెస్టు చేయించారని ఆయన అన్నారు. కెసిఆర్ కి మానవ సంబంధాల విలువ తెలియాలంటే బలగం సినిమా చూపించాలని ఈ సందర్భంగా బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.
Also Read: Origin of Tollywood: టాలీవుడ్ కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఇంత పెద్ద కధ ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook