తెలుగు రాష్ట్రాల ప్రజలు నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య కరోనా మందు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ముందుగానే ఆదివారం ఆనందయ్య కుటుంబసభ్యులు కరోనా మందును పంపిణీ (Anandaiah Medicine Distribution) ప్రారంభించడంతో గందరగోళం నెలకొంది. గత నెల 21 తరువాత ఆనందయ్య మందు పంపిణీ చేయడం ఇదే తొలిసారి.
సొంత నియోజకవర్గమైన సర్వేపల్లి ప్రజలకు ఆనందయ్య కరోనా మందును పంపిణీ చేయాలని భావిస్తున్నారు. ఆ తరువాత రాష్ట్ర ప్రజలకు, ఇతర రాష్ట్రాల వారికి ఆనందయ్య తయారుచేస్తున్న ఔషధాన్ని ఇవ్వాలనుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం కోవిడ్19 మందు పంపిణీని ఆనందయ్య సోదరుడు నాగరాజు, కుటుంబసభ్యులు ప్రారంభించారు. స్థానిక ప్రాంతాల నుంచి ప్రజలు భారీ సంఖ్యలో ఆనందయ్య మందు కోసం కృష్ణపట్నం చేరుకున్నారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా కరోనా మందు (Anandayya Corona Medicine) పంపిణీ చేస్తున్నారని పోలీసులు ఆనందయ్య ఔషధం పంపిణీని అడ్డుకున్నారు.
Also Read: Krishnapatnam Police: ఏపీ మాజీ మంత్రి Somireddy Chandramohan Reddyపై కేసు నమోదు
అధికారుల అనుమతి, నిర్ణీత తేదీ నుంచి పంపిణీ ప్రారంభించాలని అంతకుముందే ఆనందయ్య కరోనా మందు ఇవ్వడంతో ప్రజలు భారీగా అక్కడికి చేరుకున్నారని పోలీసులు చెబుతున్నారు. భద్రతా పరంగా అంతా సిద్ధమైతేనే ఆ మందు పంపిణీ ప్రారంభించాల్సి ఉంటుందన్నారు. ఆనందయ్య మందు (Anandaiah mandu) రెగ్యూలర్‌గా పంపిణీ చేసే చోట కాకుండా మరోచోట కరోనా ఔషధాన్ని ప్రజలకు పంపిణీ చేసేందుకు ఏపీ సర్కార్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
Also Read: Anandayya Covid-19 Medicine: ఆనందయ్య కరోనా మందుపై టీటీడీ అందుకే వెనక్కి తగ్గిందా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook