డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. తద్వారా 5 పర్యాయాలు ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ఏకైక జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది. అయితే మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో జట్టు సభ్యులను ప్రశంసించారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) టైటిల్ ఈసారి కూడా తమదేనంటున్నాడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా (Hardik Pandya). అవును మరి ఆ జట్టు ఫైనల్‌కు చేరిందంటే కప్పు ఎగరేసుకుపోవడం దాదాపుగా ఖాయం. అందులోనూ గత 7 ఐపీఎల్ ట్రోఫీలలో నాలుగు టైటిల్స్ ముంబై ఇండియన్స్ నెగ్గడం గమనార్హం.
Mumbai Indians vs Delhi Capitals IPL 2020లో భాగంగా ముంబై ఇండియన్స్ (Mumbai Indians) జట్టు అరుదైన ఘనతను సాధించింది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)తో తలపడ్డ మ్యాచ్ ద్వారా ముంబై ఇండియన్స్ జట్టు ఆ ఘనతను అందుకుంది.
కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుపై ముంబై ఇండియన్స్ 48 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. పంజాబ్ జట్టు పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు భారీ స్కోరు చేసింది. అందుకు కెప్టెన్ రోహిత్ ఓ కారణమైతే... చివరి ఓవర్లలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, పోలార్డ్‌లు పరుగుల వరద పారించడం మరో కారణం.
IPL 2020లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ, సీఎస్కే ఆటగాడు సురేష్ రైనాల సరసన (Rohit Sharma completes 5000 IPL Runs) నిలిచాడు.
ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సూపర్ ఓవర్ (RCB vs MI Super Over In IPL 2020)లో విజయాన్ని అందుకుంది. అయితే 99 పరుగులు చేసిన ఇషాన్ కిషన్‌ను పక్కనబెట్టి హార్ధిక్ పాండ్యాను బ్యాటింగ్‌కు ఎందుకు పంపించారో రోహిత్ శర్మ వెల్లడించాడు.
MS Dhoni Funny Comments: చాలా కాలం తర్వాత ఎంఎస్ ధోనీ మైదానంలో కనిపించి తన అభిమానులలో నూతనోత్సాహాన్ని నింపాడు. ధోనీ తొలి మ్యాచ్ ప్రారంభానికి ముందే తనదైన మార్క్ పంచ్ విసిరాడు. కీపర్లకు సోషల్ డిస్టెన్సింగ్‌పై ధోనీ పేల్చిన జోక్ వైరల్ అవుతోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన ఘనత సాధించాడు. చెన్నై జట్టుకు 100వ విజయాన్ని అందించిన కెప్టెన్ (MS Dhoni records 100 wins as captain for CSK) అయ్యాడు ధోనీ. ఓ ఫ్రాంచైజీ తరఫునగానీ, లేక ఓవరాల్ ఐపీఎల్‌లోగానీ 100 విజయాలు అందుకున్న ఏకైక కెప్టెన్ ధోనీనే.
IPLలో ఉత్తమ ఆటగాడిగా, కెప్టెన్‌గా రోహిత్ శర్మ (Mumbai Indians Captain Rohit Sharma) విజయవంతంగా ముందుకు సాగుతున్నాడు. క్రిస్ లిన్‌ను ఓపెనింగ్‌లో పంపించి రోహిత్ వన్‌డౌన్, లేక సెకండ్ డౌన్లో బ్యాటింగ్‌కు దిగుతాడని ప్రచారం జరుగుతోంది. ఈ ఊహాగానాలకు రోహిత్ శర్మ చెక్ పెట్టాడు.
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సంబరం రానే వచ్చింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) రేపటి (సెప్టెంబర్ 19) నుంచి ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ముంబై, చెన్నై (Mumbai Indians vs Chennai Super Kings) మధ్య జరగనున్న తొలి మ్యాచ్‌కు అబు దాబి వేదికగా మారింది.
సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar) యూఏఈలో ముంబై ఇండియన్స్ జట్టుతో కలిసి నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. అయితే ఈ ఏడాది అర్జున్ ముంబై ఇండియన్స్ తరఫున ఆడి ఐపీఎల్లో అరంగేట్రం చేయనున్నాడని ప్రచారం జరుగుతోంది. ముంబై ఇండియన్స్ దీనిపై ఏ ప్రకటన చేయలేదు.
Trent Boult Practice Video | ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఆటగాళ్లు సైతం కఠోర సాధన చేస్తున్నారు. ట్రెంట్ బౌల్ట్ (Trent Boult) ఐపీఎల్ 2020కి బాగానే సన్నద్దమయ్యాడని తెలుస్తోంది.
కీరన్ పోలార్డ్ హీరోయిత ఇన్నింగ్స్ ఆడటంతో (Caribbean Premier League)లో బార్బడోస్ ట్రిడెంట్స్ జట్టుపై ట్రింబాగో నైట్ రైడర్స్ 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
భారత ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.