క్రికెటర్లు ఎవరైనా కెప్టెన్సీ బాధ్యతలు చేతికి వస్తే చాలు.. తమ సత్తా చూపిస్తామని, లేక జట్టు ఆటగాళ్లకు సలహాలు ఇవ్వడం, ఆధిపత్యం ప్రదర్శించడమో చేస్తుంటారు. కానీ భారత ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సెప్టెంబర్ 19న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2020) ప్రారంభం కానున్న నేపథ్యంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్ రోహిత్ శర్మ. జట్టులో అందరి కంటే అతి తక్కువ ప్రాధాన్యం తనకేనంటూ కామెంట్ చేశాడు. MS Dhoni ఆ విషయాన్ని ముందే చెప్పాడు: యువీ
అదేంటి ముంబై జట్టుకు రికార్డు స్థాయిలో 4సార్లు ఐపీఎల్ టైటిల్ విన్నర్‌గా నిలిపిన రోహిత్ ఇలా మాట్లాడటం ఏంటని అనుమానం వస్తుంది కదా. పీటీఐతో మాట్లాడుతూ రోహిత్ చెప్పిన విషయాలివి. ‘ఒకవేళ నేను కెప్టెన్ అయితే, జట్టులో అతి తక్కువ ప్రాధాన్యత ఉన్న ఆటగాడిని నేనేనని భావిస్తాను. ఈ భావన ఒక్కో కెప్టెన్‌కు ఒకో తీరుగా ఉంటుంది. నేను ఇప్పటివరకూ ఇలాంటి సిద్ధాంతంతోనే పనిచేశాను. ఐపీఎల్ టోర్నీలో నాకు చాలావరకు ఇది ఫలితాల్నిచ్చింది. జట్టుకోసం ఫలితాన్ని రాబట్టే ఆటగాళ్లకు ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగుతాను. ధోనీ రికార్డును ఈజీగా బద్దలుకొట్టిన Eoin Morgan
కెప్టెన్ ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే ఓపిక నశిస్తుంది. ఆటగాళ్లపై నోరు పారేసుకుంటాం. కానీ అది మంచిది కాదు. భావోద్వేగాలను నియంత్రించుకోవాలి. ఐపీఎల్‌కు ముందు మాకు చాలా సమయం దొరికింది. ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై ఫోకస్ చేస్తున్నాం. ముంబైలో వర్షాలు, వాతావరణం కారణంగా బయటకు వెళ్లి వర్కౌట్స్ చేసే పరిస్థితి లేదు. అందుకే ఇంట్లోనే జిమ్ చేస్తున్నాను. దుబాయ్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అక్కడ ఆడటం అంత తేలికేమీ కాదని’ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. పెళ్లికి ముందే గర్భం దాల్చిన నటీమణులు వీరే...
Photos: గులాబీ డ్రెస్సులో యంగ్ బ్యూటీ సోయగాలు..