జనసేన పార్టీని రాజకీయ లబ్ది గల పార్టీగా చూడకూడదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ రోజు అమరావతిలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న ఆయన వివిధ అంశాలపై స్పందించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్య విషయాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి చేరుకున్న కేంద్ర విమానయాన శాఖమంత్రి పూసపాటి అశోకగజపతి రాజు మరియు కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ సహాయమంత్రి సుజనా చౌదరిలు తమ రాజీనామా లేఖలను ఆయనకు సమర్పించారు.
జనసేన ఆధ్వర్యంలో నియమించిన జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (నిజనిర్థారణ కమిటీ) సమావేశాలకు వచ్చిన కార్యకర్తలు, మిగతా పార్టీల ప్రతినిధులు, మీడియా సంస్థల ప్రతినిధులు అందరికీ జనసేన పార్టీ వ్యవస్థాపకులు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
ప్రత్యేక హోదా విషయం గురించి పోరాడుతూ.. కేంద్రంపై ఒకవేళ టీడీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. తాను మద్దతిస్తానని.. అయితే ప్యాకేజీ విషయాన్ని పక్కనపెట్టి..కేవలం ప్రత్యేక హోదా నిమిత్తమే నిజాయతీగా పోరాడాలని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
లోక్సభలో టీడీపీ ఎంపీలు అలజడి సృష్టించారు. బడ్జె్ట్లో ఏపీకి ఏమీ ఇవ్వలేదని.. తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ ఎంపీలు ఆందోళన చేయగా.. వారిపై స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనసేన వ్యవస్థాపకులు పవన్ కల్యాణ్ కొద్ది రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజాయాత్రను ప్రారంభిస్తారని ఆ పార్టీ మీడియా వ్యవహారాల ఇన్ఛార్జి హరిప్రసాద్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ఇక వీలున్నప్పుడల్లా ప్రజానీకంతో మమేకమవుతూ.. వారి మధ్యకు వచ్చి వారి సమస్యలను తెలుసుకుంటారని ఆయన తెలియజేశారు. 2014లో అప్పటి రాజకీయ కారణాల మేరకు, ప్రజల పరిస్థితి మేరకు, జనసేన పార్టీ తెదేపా - భాజాపా కూటమికి మద్దతిచ్చిందని... కానీ నేటి పరిస్థితులు వేరని.. తాము ఎవరితో పొత్తు పెట్టుకోవాలన్నది సమయమే నిర్ణయిస్తుందని చెప్పారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.