బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఎకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాట్నాలో ఆదివారం జరిగిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) సమావేశంలో కూటమి భాగస్వామ్య పార్టీలైన బీజేపీ, వీఐపీ, హెచ్ఏఎమ్ పార్టీలు జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ (Nitish Kumar elected NDA leader) ను ఎన్నుకున్నాయి.
బీహార్‌లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే మొదటి విడత ఎన్నికలకు (Bihar Assembly election 2020) నోటిఫికేషన్ వెలువడటంతో రాష్ట్రంలో రాజకీయ వేడి ప్రారంభమైంది. ఈ క్రమంలో మహాకూటమి దళానికి (RJD-Congress-Left) శుభవార్త వచ్చినట్టే వచ్చి.. మళ్లీ నిరాశలో మునిగేలా చేసింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలైన బీజేపీ, జేడీయూ మధ్య సీట్ల పంపకం పూర్తయింది. ఈ కూటమికి ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యం వహించనున్నారు. అందరూ ఊహించినట్లుగానే 50:50 సీట్లను బీజేపీ, జేడీయూ పంచుకున్నాయి.
బీహార్ ఎన్నికల వేడి ప్రారంభమైంది. మూడు విడతల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మొదటివిడత నామినేషన్ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ముగియనుంది. అయితే మహాకూటమి (Congress, RJD, Left) పార్టీల మధ్య సీట్ల పంపకం నిన్ననే పూర్తయింది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర అధికార పార్టీలైన జేడీయూ, బీజేపీ ( JDU- BJP) మధ్య సీట్ల ఒప్పందం కుదిరినట్లు సమాచారం.
బీజేపీ (BJP) కి చిరకాల మిత్రపక్షమైన శిరోమణి అకాలీదళ్ షాక్ ఇచ్చింది. అధికార పార్టీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) నుంచి తప్పుకుంటున్నట్లు అకాలీదళ్ (SHIROMANI AKALI DAL) ప్రకటించింది. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆ పార్టీ నేతలు కొన్ని రోజుల నుంచి గళం వినిపిస్తున్నారు. ఆ బిల్లులను నిరసిస్తూ.. అకాలీదళ్ పార్టీ ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్ (Harsimrat Kaur Badal) కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
బీజేపీ మైనారిటీ మోర్చా జాతీయ అధ్యక్షుడు అబ్దుల్ రషీద్ అన్సారీ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ పార్టీ ముస్లిముల విశ్వాసాన్ని పొందడానికి అహర్నిశలు ప్రయత్నిస్తోందని తెలిపారు.
కాశ్మీర్లో మిలిటెంట్లను మట్టుబెట్టామని ఎన్డీఏ ప్రభుత్వం చెప్పుకుంటున్నప్పటికీ.. అదే ప్రాంతాన్ని హింసా రాజ్యంగా మార్చిన ఘనత కూడా అదే ప్రభుత్వానికి దక్కుతుందని జమ్ము కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీలు పెట్టిన అవిశ్వాస నోటీసులు సోమవారం లోక్‌సభ ముందుకు రానున్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.