Shikhar Dhawan could not understand the accent of the reporter: మూడు వన్డేల సిరీస్ కోసం భారత జట్టు ప్రస్తుతం జింబాబ్వేలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. వన్డేల సిరీస్ కోసం భారత్ ఇప్పటికే ప్రాక్టీస్‌ను కూడా షురూ చేసింది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత ఆటగాళ్లు మైదానంలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఆగస్ట్ 18న భారత్, జింబాబ్వే జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన, సన్నద్ధత, సిరీస్ గురించి టీమిండియా తాత్కాలిక వైస్ కెప్టెన్ శిఖర్ ధావన్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నాడు.
ప్రెస్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్న శిఖర్ ధావన్‌కు అర్ధం కాక బిక్క మొహం వేశాడు. ప్రస్తుతం గబ్బర్ ప్రదర్శించిన హావభావాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏం జరిగింది అంటే.. 'జింబాబ్వే ప్రస్తుతం బాగా ఆడుతోంది. పూర్వవైభవం దిశగా అడుగులు వేస్తోంది. ఈ జట్టుతో ఆడటం టీమిండియాకు ఏ మేరకు లాభిస్తుంది. ఇటీవలి కాలంలో జింబాబ్వే మీతో మీరు మ్యాచులు ఆడలేదు. జింబాబ్వే జట్టుపై గెలవడం సులవునేనని మీరు భావిస్తున్నారా?' అని ధావన్‌ను రిపోర్టర్ అడిగారు.
— Guess Karo (@KuchNahiUkhada) August 16, 2022
రిపోర్టర్ తన యాసలో వేగంగా మాట్లాడడంతో.. ఏం అడిగాడో సరిగా అర్ధం కాని శిఖర్ ధావన్ బిక్క మొహం పెట్టాడు. మరోసారి అదే ప్రశ్నను అడగాలని గబ్బర్ రిపోర్టర్‌ను కోరాడు. ఈసారి రిపోర్టర్ కాస్త నెమ్మదిగా ఆడగడంతో.. అర్ధం చేసుకున్న ధావన్ అందుకు సమాధానమిచ్చాడు. ఏదేమైనా ధావన్ ముందుగా ఇచ్చిన షాకింగ్ రియాక్షన్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియో చుసిన నెటిజన్లు సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ పర్యటనకు కెప్టెన్‌గా తొలుత శిఖర్ ధావన్‌ను ప్రకటించినా.. కేఎల్ రాహుల్ రావడంతో బీసీసీఐ అతడికి జట్టు పగ్గాలను అప్పగించింది.
Also Read: కార్తికేయ 2 సినిమా విజయానందం కంటే.. బాధే ఎక్కువగా ఉంది: అనుపమ పరమేశ్వరన్
Also Read: Vizag Serial Killer: వరుస హత్యలతో విశాఖ వాసులను బెంబేలెత్తించిన సీరియల్ కిల్లర్ అరెస్ట్...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook