WORLD CUP 2011 విజయానికి తొమ్మిదేళ్లు సందర్భంగా టీమిండియా క్రికెటర్ సురేష్ రైనా పలు విషయాలను షేర్ చేసుకున్నాడు. క్వార్టర్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై 34 నాటౌట్, సెమీ ఫైనల్లో పాకిస్థాన్‌పై 36 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన రైనా జట్టు విజయాల్లో తన పాత్ర పోషించాడు. ప్రతి ఒక్కరూ టీమిండియా బ్యాటింగ్ గురించి మాట్లాడతారు కానీ బౌలింగ్‌పై మౌనంగా ఉంటున్నారని పీటీఐతో అన్నాడు. మేమేమి చేశాము నేరం.. సెక్స్ వర్కర్ ఆవేదన!
బ్యాటింగ్‌లో సచిన్ టెండూల్కర్ ఎలాగో భారత జట్టు బౌలింగ్ జహీర్ ఖాన్ కూడా మాకు సచిన్ టెండూల్కర్ లాంటి వాడని కితాబిచ్చాడు రైనా. 2011 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ ఆల్ రౌండర్ షాహిద్ ఆఫ్రిదితో కలిసి సంయుక్తంగా అత్యధికంగా 21 వికెట్లు తీసిన బౌలర్ జహీర్ ఖాన్ అని గుర్తు చేశాడు. అయితే యువరాజ్ సింగ్ 362 పరుగులతో పాటు 15 వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ యువీని వరించినా.. భారత్‌కు ప్రయోజనమే చేకూరిందన్నాడు. Also Read: భారీగా పెరిగిన బంగారం ధరలు..
ప్రతి ఒక్కరూ బ్యాటింగ్ గురించి మాట్లాడుతున్నారు, కానీ భారత బౌలింగ్ దళాన్ని జహీర్ ఖాన్ ముందుండి నడిపించిన తీరు అమోఘం. జట్టుకు అవసరమైన ప్రతి సందర్భంలో వికెట్లు తీశాడని కొనియాడాడు. అందుకే భారత బౌలింగ్‌లో అతడు టెండూల్కర్ లాంటివాడు. యువీ నుంచి జహీర్‌కు మంచి సపోర్ట్ లభించింది. పరుగులు చేయడంతో పాటు వికెట్లు తీసి యువీ కూడా రాణించాడు. ప్రపంచంలోనే హాట్ మోడల్ Bikini Photos
శ్రీలంక మాకు సవాల్ చేసే టార్గెట్ నిర్ధేశించాక డ్రెస్సింగ్ రూములో అంతా నిశ్శబ్ధం. ఇన్నింగ్స్ బ్రేక్ టైమ్‌లో కొందరు తింటున్నారు, కొందరు ఐస్ బాత్ చేశారు, ఇంకొందరు స్నానాలు చేశారు. అంతేకానీ ఏ క్రికెటర్ కూడా మాట్లాడుకోలేదు. అందరి లక్ష్యం మాత్రం ఒక్కటే. వరల్డ్ కప్ సాధించడం. సచిన్ ఔటయ్యాక అంతా సైలెంట్ అయిపోయాం. కానీ గంభీర్ బ్యాటింగ్ చూశాక అతడు మనకు వరల్డ్ కప్ అందిస్తాడని నమ్మకం కలిగింది. లంక బౌలర్ మురళీదరన్‌ను బాగా ఎదుర్కోగలనని కోచ్ గ్యారీ కిర్‌స్టెన్‌కు ధోనీ చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకున్నాడు’ సీనియర్ క్రికెటర్ రైనా. బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone