New Zealand beat Team India to win WTC: న్యూజిలాండ్ ఎట్టకేలకు సాధించింది. వరుసగా రెండు వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్‌లో ఓటమి చెందిన న్యూజిలాండ్ క్రికెట్ జట్టు దేశ ప్రజలు గర్వపడేలా చేసింది. క్రికెట్‌కు ప్రామాణికంగా భావించే టెస్టుల్లో అత్యుత్తమ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఐసీసీ నిర్వహించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతగా కివీస్ అవతరించింది. గత 18 ఏళ్లలో న్యూజిలాండ్ చేతిలో ఐసీసీ ఈవెంట్లలో టీమిండియా ఓటముల పరంపర కొనసాగుతోంది.
ఇంగ్లాండ్‌లోని సౌతాంప్టన్ వేదికగా జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్ టెస్టులో టీమిండియాను 8 వికెట్ల తేడాతో ఓడించి అంతర్జాతీయ క్రికెట్ మండలి నిర్వహించే మెగా ఈవెంట్‌లో తొలిసారి విజయకేతనం ఎగురవేసింది. త్వరత్వరగా ఓపెనర్ల వికెట్లు కోల్పోయినా సీనియర్ క్రికెటర్ రాస్ టేలర్ (47 నాటౌట్) సహకారంతో కెప్టెన్ కేన్ విలియమ్సన్ (52 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో కదం తొక్కాడు. ఐసీసీ నిర్వహించిన తొలి డబ్ల్యూటీసీలో టీమిండియా (Team India)ను ఓడించి కివీస్‌కు ట్రోఫీని అందించాడు.
Also Read: ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాకింగ్స్‌లో టాప్ లేపిన Ravindra Jadeja
వరుసగా రెండు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్ పరాభవాల తరువాత న్యూజిలాండ్ అంతకుమించి ప్రాధాన్యత ఉన్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిన్ కైవసం చేసుకోవడం గమనార్హం. తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 2 కీలక వికెట్లు పడగొట్టిన న్యూజిలాండ్ బౌలర్ కైల్ జేమీసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 217, రెండో ఇన్నింగ్స్‌లో 170 పరుగులకు ఆలౌటైంది. 139 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 2 వికెట్లు 140 పరుగులు చేసి తొలి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC Final) కైవసం చేసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook