WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. మ్యాచ్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుదో తెలుసా?

What Will Happen If WTC Final 2023 Between India vs Australia Ends A Draw?. డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయినా లేదా మ్యాచ్‌ డ్రా అయినా ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందో తెలుసా?.  

Written by - P Sampath Kumar | Last Updated : Jun 3, 2023, 03:07 PM IST
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ 2023.. మ్యాచ్ డ్రా అయితే ట్రోఫీ ఏ జట్టుదో తెలుసా?

If WTC 2023 Final Between India vs Australia Ends A Draw Which Team Will Win: రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 2023 ముగిసిన విషయం తెలిసిందే. మరో రెండు రోజుల్లో ఐసీసీ ప్రపంచ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ 2023 ఆరంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడనుంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జూన్‌ 7 నుంచి 11 వరకు ఫైనల్‌ పోరు జరగనుంది. గత టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓటమిపాలైన భారత్.. ఈసారి ఎలాగైనా కప్ కొట్టాలనే కసితో బరిలోకి దిగుతోంది. మరోవైపు ఆసీస్ కూడా తొలి ట్రోఫీ కోసం బరిలోకి దిగుతోంది. 

2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచిన భారత్.. అప్పటినుంచి ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా గెలవలేకపోయింది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని టీమిండియా భావిస్తోంది. అయితే ఈ మ్యాచుకు వర్షం ముప్పు పొంచి ఉంది. ఎందుకంటే.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ జరిగే ఇంగ్లాండ్‌లో ప్రస్తుతం వర్షకాలం. అక్కడ వర్షాలతో పాటు చలి తీవ్రత కూడా అధికంగా ఉంది. దాంతో భారత ఫాన్స్ ఆందోళన చెందుతున్నారు. 

డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయినా లేదా మ్యాచ్‌ డ్రా అయినా ఏ జట్టు ఛాంపియన్‌గా నిలుస్తుందనే ప్రశ్న అభిమానుల్లో మెదులుతోంది. ఐదు రోజుల ఆటకు వర్షం అంతరాయం కలిగిస్తే.. రిజర్వ్ డే (జూన్ 12)ను వాడుకుంటారు. ఆ రోజు కూడా ఆట సాధ్యం కాకపోతే.. ఆస్ట్రేలియా, భారత్ జట్లు విజేతలుగా నిలుస్తాయి. ఒకవేళ మ్యాచ్ డ్రా అయినా కూడా ఇరు జట్లు సంయుక్త విజేతగా నిలుస్తాయి. ఐపీఎల్ మాదిరి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియా విజేతగా నిలవదు. 

జట్లు:
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఛెతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, మహ్మద్ షమీ, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా: పాట్ కమిన్స్ (కెప్టెన్), డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, ఉస్మాన్ ఖవాజా, స్టీవ్ స్మిత్ (వైస్ కెప్టెన్), కామెరూన్ గ్రీన్, మార్కస్ హారిస్, మార్నస్ లాబూషేన్, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), స్కాట్ బోలాండ్, జోష్ హాజిల్‌వుడ్, నాథన్ లయోన్, టాడ్ మర్ఫీ, మిచెల్ స్టార్క్.

 Also Read: Keerthy Suresh Hot Pics: బ్లాక్ శారీలో మెరిసిపోతున్న కీర్తి సురేష్.. వెన్నెల అందం మరో లెవెల్! పిక్స్ వైరల్  

Also Read: Rakul Preet Singh Hot Pics: బికినీలో కాక రేపుతున్న రకుల్ ప్రీత్ సింగ్.. ఘాటు అందాలకు కుర్రకారు పని ఔట్!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK.

 

Trending News