Australia beat India to Qualify ICC Women's World Cup 2022 Semis: ఐసీసీ మహిళా వన్డే ప్రపంచకప్ 2022లో ఆస్ట్రేలియా సెమీస్ చేరింది. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌లు గెలిచిన ఆస్ట్రేలియా.. ఆక్లాండ్ వేదికగా శనివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియాను కూడా చిత్తుచేసింది. భారత్ నిర్ధేశించిన 278 పరుగుల లక్షాన్ని ఆసీస్ 6 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు ఉండగానే ఛేదించింది. మెగ్ లానింగ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (97; 107 బంతుల్లో 13 ఫోర్లు) అడగా.. ఇన్నింగ్స్ చివరలో బెత్ మూనీ భారత బౌలర్లపై విరుచుకుపడి తన జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. భారత బౌలర్లలో పూజా వస్త్రాకర్ రెండు వికెట్లు పడగొట్టింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలంటే.. గెలవాల్సిన మ్యాచ్‌లో ఓటమి పాలైన మిథాలీ సేనకు ఇకపై చావోరేవో పరిస్థితి నెలకొంది.
278 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు మంచి ఆరంభం దక్కింది. ఓపెనర్ అలీసా హీలీ (72; 65 బంతుల్లో 9 ఫోర్లు), రాచెల్ హేన్స్ (43) భారత బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు చేశారు. బౌండరీలు బాదుతూ 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. స్వల్ప వ్యవధిలో ఓపెనర్లు పెవిలియన్ చేరినా.. మెగ్ లానింగ్, ఎల్లీస్ పెర్రీ జట్టును ఆదుకున్నారు. దాంతో ఆసీస్ కోలుకుంది. ఆస్ట్రేలియా 41 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసిన సమయంలో వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. అప్పటికే మెగ్ లానింగ్ హాఫ్ సెంచరీ పూర్తిచేసింది.
వర్షం తగ్గడంతో అట మళ్లీమొదలైంది. ఎల్లీస్ ఔట్ అయినా బెత్ మూనీ ధాటిగా ఆడింది. ఇక చివరి 12 బంతుల్లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు అవసరం అయ్యాయి. 49వ ఓవర్ వేసిన మేఘన సింగ్.. సూపర్ బౌలింగ్‌తో లాన్నింగ్‌ను ఔట్ చేసి మూడు పరుగులు మాత్రమే ఇచ్చింది. దాంతో భారత జట్టులో గెలుపు ఆశలు చిగురించాయి. చివరి ఓవర్‌లో ఆసీస్ విజయానికి 8 పరగులు అవసరం కాగా.. జులన్ గోస్వామి మొదటి బంతికే బౌండరీ ఇచ్చింది. ఆపై బెత్ మూనీ 2, 4 పరుగులు బాదడంతో భారత్ ఆశలు అడియాశలయ్యాయి. మెగా టోర్నీలో మిథాలీ సేనకు ఇకపై చావోరేవో పరిస్థితి నెలకొంది.
ముందుగా బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 277 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ 68; 96 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్), యస్తిక భాటియా (59; 83 బంతుల్లో 6 ఫోర్లు), హర్మన్ ప్రీత్ కౌర్ ( 57 నాటౌట్; 47 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఇన్నింగ్స్ చివర్లో పూజా వస్త్రాకర్ ( 34; 28 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) మెరుపులు మెరిపించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో డార్సీ బ్రౌన్ మూడు వికెట్లు పడగొట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook