INDW vs PAKW: హాఫ్ సెంచరీలతో ఆదుకున్న పూజా, స్నేహ్.. పాకిస్తాన్‌కు భారీ టార్గెట్!!

ICC Women's World Cup 2022, INDW vs PAKW: మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో టీమిండియా పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి 244 రన్స్ చేసి.. పాకిస్తాన్ ముందు 245 పరుగుల టార్గెట్ ఉంచింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2022, 11:12 AM IST
  • ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022
  • హాఫ్ సెంచరీలతో ఆదుకున్న పూజా
  • పాకిస్తాన్‌కు భారీ టార్గెట్
INDW vs PAKW: హాఫ్ సెంచరీలతో ఆదుకున్న పూజా, స్నేహ్.. పాకిస్తాన్‌కు భారీ టార్గెట్!!

ICC Women's World Cup 2022, India Post 245 Target to Pakistan: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ 2022లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో టీమిండియా పోరాడే స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో  7 వికెట్ల నష్టానికి 244 రన్స్ చేసి.. పాకిస్తాన్ ముందు 245 పరుగుల టార్గెట్ ఉంచింది. 114 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన సమయంలో స్నేహ రాణా (53; 48 బంతుల్లో 4x4), పూజా వస్త్రాకర్‌ (67; 59 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు. ఓపెనర్‌ స్మృతి మంధాన (52; 75 బంతుల్లో 3x4, 1x6) ఆకట్టుకుంది. పాక్ బౌలర్లు నిదా దార్, నష్రా సంధు తలో రెండు వికెట్లు పడగొట్టారు. 

ఈ మ్యాచులో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత మహిళల జట్టుకు భారీ పాక్‌ తగిలింది. మూడో ఓవర్‌లోనే స్టార్ ఓపెనర్‌ షెఫాలి వర్మ (0) డకౌట్‌గా అయింది. అనమ్ అమీన్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి ఔట్ అయింది. ఈ సమయంలో మరో ఓపెనర్‌ స్మృతి మంధాన (52), వన్‌డౌన్‌ బ్యాటర్‌ దీప్తి శర్మ (40; 57 బంతుల్లో 2x4) కీలక ఇన్నింగ్స్ ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం జోడించారు. దాంతో భారత జట్టు కోలుకుంది. 

అనూహ్యంగా పుంజుకున్న పాక్‌ మహిళా బౌలర్లు భారత్‌ను గట్టి దెబ్బ కొట్టారు. 18 పరుగుల స్వల్ప వ్యవధిలో ఐదు కీలక వికెట్లు తీసి టీమిండియాను కష్టాల్లోకి నెట్టారు. కెప్టెన్ మిథాలి రాజ్‌ (9), స్టార్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (5), రీచా ఘోష్‌ (1) స్వల్ప పరుగులకే పెవిలియన్ చేరారు. ఈ దశలో పూజా వస్త్రాకర్‌, స్నేహ్‌ రాణా జట్టును ఆదుకున్నారు. పాక్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొని పరుగులు చేశారు. చెత్త బంతులను మాత్రమే బౌండరీలు తరలిస్తూ ఇన్నింగ్స్‌ను నిర్మించారు. 

పూజా వస్త్రాకర్‌, స్నేహ్‌ రాణా జోడిని విడదీసేందుకు పాక్ బౌలర్లు చాలా కష్టపడ్డారు. పూజా, రాణా స్ట్రైక్ రొటేట్ చేస్తూ భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలోనే హాఫ్ సెంచరీలు చేశారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు ఏకంగా 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇన్నింగ్స్ చివర్లో ధాటిగా ఆడేక్రమంలో పూజా ఔటయ్యింది. జులన్ గోస్వామి (6), రాణా నాటౌట్‌గా నిలిచారు. పాకిస్తాన్ బౌలర్లు నిదా దార్, నష్రా సంధు తలో రెండు వికెట్లు పడగొట్టారు.

Also Read: Shane Warne: 10 సంవత్సరాల క్రితం వైన్ కూడా ఉంది.. మరణానికి ముందు ఏం జరిగిందో చెప్పిన షేన్‌ వార్న్‌ మేనేజర్‌!!

Also Read: IND vs SL: భారత్ తొలి ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేయడానికి కారణం ఏంటో చెప్పిన రవీంద్ర జడేజా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News