IPL 2022 RCB vs SRH: ఐపీఎల్ మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. ఆదివారం మరో రెండు ఇంట్రెస్టింగ్ మ్యాచ్ లు జరగనున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తో తలపడనుంది. మరో ఢిల్లీ క్యాపిటల్స్ చైన్నై సూపర్ కింగ్స్ ను ఢీ కొట్టనుంది. వాంఖడే వేదికగా జరిగే ఎస్ఆర్హెచ్- ఆర్సీబీ మ్యాచ్ కు వాంఖడే స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం మూడున్నరకు ప్రారంభంకానుంది.
ఐపీఎల్ లో ఇప్పటివరకు హైదరాబాద్ ఆడిన పది మ్యాచుల్లో కేవలం ఐదు మాత్రమే గెలిచింది. గత మూడు మ్యాచుల్లో హైదరాబాద్ జట్టు కేవలం స్వల్ప పరుగుల తేడాతోనే ఓటమిపాలైంది. అటు ఆర్సీబీ ఇప్పటివరకు 11 మ్యాచులు ఆడితే అందులో ఆరు విజయాలు ఉన్నాయి. గత మ్యాచ్‌లో చెన్నైపై ఆర్సీబీ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఆర్సీబీలో కోహ్లీ , డుప్లెసిస్ ఓపెనింగ్ భాగస్వామ్యం బావుంటేనే బెంగళూరు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తది అని చెప్పుకోవచ్చు. ఆ తర్వత బ్యాటింగ్ కు మ్యాక్స్ వెల్, దినేష్ కార్తీక్, లోమ్రార్ లాంటి మంచి ప్రతిభ ఉన్న ఆటగాళ్లే ఉన్నారు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్ ఈ సీజన్లో ఇప్పటివరకు 316 పరుగులుచేశాడు. అందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఆర్సీబీ బౌలింగ్ లో హజిల్‌వుడ్, సిరాజ్, హర్షల్ పటేల్, హసరంగా కీలకం కానున్నారు.
సన్ రైజర్స్ హైదరాబాద్ లో కెప్టెన్ విలియమ్సన్ తో పాటు అభిషేక్ శర్మ మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఆదిలోనే వికెట్ కోల్పోకుండా ఆడితే హైదరాబాద్ జట్టు అద్భుత విజయం సాధించడం పక్కా. అభిషేక్ శర్మ ఇప్పటికే 331 పరుగులతో టాప్ స్కోరర్ లలో ఒకడిగా ఉన్నాడు. ఆ తర్వాత మార్కరం, నికోలాస్ పూరన్, రాహుల్ త్రిపాఠి కూడా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఇక హైదరాబాద్ పేస్ బౌలింగ్ కాస్త పటిష్ఠంగా ఉందనే చెప్పుకోవాలి. జట్టులో నటరాజన్, భువనేశ్వర్, ఉమ్రాన్ మాలిక్ తో పాటు అబాట్, కార్తీక్ త్యాగి కూడా ఉన్నాడు.
Also Read:RR vs PBKS: పంజాబ్ కింగ్స్ లెవెన్‌పై రాజస్థాన్ రాయల్స్ 6 వికెట్ల తేడాతో విజయం
Also Read:IPL 2022 Play Off Chances: మారుతున్న ఐపీఎల్ సమీకరణాలు.. ఎవరెవరికి ప్లే ఆఫ్ అవకాశాలు.. ??
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.