Virat Kohli: 20 నిమిషాల టైమ్ ఇస్తే.. విరాట్ కోహ్లీ సమస్య పరిష్కరిస్తా: గవాస్కర్

WI vs IND, Sunil Gavaskar about Virat Kohli's form. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తనకు 20 నిమిషాల టైమ్ ఇస్తే సమస్యను పరిష్కరిస్తా అని సునీల్ గవాస్కర్ చెప్పారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 20, 2022, 02:04 PM IST
  • 20 నిమిషాల టైమ్ ఇస్తే
  • విరాట్ కోహ్లీ సమస్య పరిష్కరిస్తా
  • అవసరమైన సలహాలు ఇచ్చేందుకు సిద్ధం
Virat Kohli: 20 నిమిషాల టైమ్ ఇస్తే.. విరాట్ కోహ్లీ సమస్య పరిష్కరిస్తా: గవాస్కర్

WI vs IND, Sunil Gavaskar about Virat Kohli's form: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ గత మూడు ఏళ్లుగా పరుగులు చేయలేక సతమతమవుతున్నాడు. ఈజీగా హాఫ్ సెంచరీ, సెంచరీలు చేసే కోహ్లీ బ్యాట్ మూగబోయింది. మూడు ఫార్మాట్లలో ఆడపాదడపా ఇన్నింగ్స్‌లు ఆడుతున్నా.. ఒక్క సెంచరీ బాధలేదు. తాజాగా ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో విరాట్ దారుణంగా విఫలమయ్యాడు. టెస్ట్, టీ20, వన్డే మూడు ఫార్మాట్లలో పేలవ ప్రదర్శన కనబర్చాడు. దాంతో కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తోంది. మరోవైపు మాజీలు అందరూ సలహాలు ఇస్తూనే ఉన్నారు. తాజాగా టీమిండియా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా కోహ్లీకి అవసరమైన సలహాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 

విరాట్ కోహ్లీ తనకు 20 నిమిషాల టైమ్ ఇస్తే సమస్యను పరిష్కరిస్తా అని సునీల్ గవాస్కర్ చెప్పారు. తాజాగా ఇండియా టూడేతో సన్నీ మాట్లాడుతూ... 'విరాట్ కోహ్లీని కలిసి 20 నిమిషాలు మాట్లాడితే.. అతడు ఏం చేస్తే బాగుంటుందో చెప్పగలను. నా సలహాలు కోహ్లీకి  సహాయపడవచ్చు. ఆఫ్‌ స్టంప్‌ మీదకు వచ్చే బంతులను ఎలా ఎదుర్కోవాలనే విషయంలో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. ఓ ఓపెనర్‌గా చెప్తున్నా.. ఒకే లైన్‌ విషయంలో ఇబ్బంది పడుతున్నాడంటే కచ్చితంగా కొన్ని సర్దుబాట్లు చేసుకోవాల్సి ఉంటుంది' అని అన్నారు. 

'పరుగులు చేయాలనే తనతో ప్రతి బంతిని ఆడేందుకు విరాట్ కోహ్లీ చూస్తున్నాడు. ఇదే అతడికి పెద్ద సమస్యగా మారింది. ఇది కోహ్లీకి చివరి పొరపాటు అయ్యుండేలా చూసుకోవాలి. పరుగులు చేయాలనే ఆలోచనలో ఉన్నపుడు బ్యాట్స్‌మెన్‌ ఆలోచన తీరు అలాగే ఉంటుంది. అయితే ఇంగ్లండ్‌ పర్యటనలో కోహ్లీ కష్టమైన బంతులకే ఔటయ్యాడు. అంతర్జాతీయ మ్యాచ్‌కు దూరంగా ఉంటే ఫామ్ అందుకోవడం కష్టమని నా అభిప్రాయం. కోహ్లీ విషయంలో కాస్త ఓపిక పట్టాలి. కోహ్లీ మూడు ఫార్మాట్లలో పరుగులు చేశాడు. 70 సెంచరీలు చేశాడు. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. గొప్ప ఆటగాళ్లంతా వైఫల్యాలను ఎదుర్కొన్నారనే విషయాన్ని మరవద్దు' అని సన్నీ చెప్పుకొచ్చారు. 

Also Read: Covid Cases:దేశంలో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. నిన్నటికంటే ఏకంగా ఐదు వేలు హైక్..   

Also Read: Ileana D'cruz: బికినీతో కాక రేపిన ఇలియానా డిక్రూజ్.. అందాలన్నీ కనిపించే విధంగా!

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News