Shreyas Iyer Fan: జోరు వర్షంలో కూడా.. టీమిండియా ఆటగాడి కోసం రెండు గంటలు వెయిట్ చేసిన లేడీ ఫ్యాన్!

Lady Fan Shizara waits for two hours to meet Shreyas Iyer. శ్రేయాస్‌ అయ్యర్‌ పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వచ్చాడని తెలుసుకున్న అతడి లేడీ ఫ్యాన్ షిజారా ఇండోర్‌ సెంటర్‌కు చేరుకుంది.  

Written by - P Sampath Kumar | Last Updated : Jul 22, 2022, 12:23 PM IST
  • రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ ఇష్టమే
  • శ్రేయాస్ అయ్యర్ అంటే పిచ్చి
  • రెండు గంటలు వెయిట్ చేసి
Shreyas Iyer Fan: జోరు వర్షంలో కూడా.. టీమిండియా ఆటగాడి కోసం రెండు గంటలు వెయిట్ చేసిన లేడీ ఫ్యాన్!

Lady Fan Shizara waits for two hours to meet Shreyas Iyer: ప్రపంచంలో ఎక్కడైనా క్రికెటర్లకు ఉండే ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొందరు తమ అభిమాన క్రికెటర్ ఆట చూసేందుకు మైదానానికి వెళ్లారు. మరొకొందరు వీరాభిమానులు తమ అభిమాన క్రికెటర్‌ని కలవడానికి బారికేడ్లను కూడా దాటిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓ లేడీ ఫ్యాన్ టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌ను కలిసేందుకు వర్షంలో కూడా రెండు గంటలు వెయిట్ చేసింది.  

మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడేందుకు వెస్టిండీస్‌ గడ్డపైకి మంగళవారం భారత్ అడుగుపెట్టింది. ముందుగా వన్డే సిరీస్  జరగనుండడంతో.. శిఖర్ ధావన్‌ నాయకత్వంలోని యువ క్రికెటర్లు శ్రేయాస్‌ అయ్యర్‌, శుబ్‌మన్‌ గిల్‌, రుతురాజ్‌ గైక్వాడ్, దీపక్‌ హుడా, సంజూ శాంసన్‌ తదితరులు ఇండోర్‌ ప్రాక్టీస్‌ చేశారు. పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌లో భారీ వర్షం కారణంగా టీమిండియా పేయర్స్ ఇండోర్‌ ప్రాక్టీస్‌కే పరిమితమయ్యారు. దాదాపు రెండు గంటల పాటు ప్రాక్టీస్‌ చేశారు. ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్ మరియు బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేల పర్యవేక్షణలో ప్రాక్టీస్ సాగింది.

శ్రేయాస్‌ అయ్యర్‌ పోర్ట్‌ ఆఫ్‌ స్పెయిన్‌ వచ్చాడని తెలుసుకున్న అతడి లేడీ ఫ్యాన్ షిజారా ఇండోర్‌ సెంటర్‌కు చేరుకుంది. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ.. దాదాపు రెండు గంటల పాటు శ్రేయాస్‌ కోసం స్టేడియం బయట వెయిట్ చేసింది. అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న అయ్యర్‌.. తన అభిమానిని కలిసి కాసేపు మాట్లాడాడు. అనంతరం చిన్న బ్యాట్‌పై ఆటోగ్రాఫ్‌ ఇచ్చి వెళ్ళిపోయాడు. దాంతో లేడీ ఫ్యాన్ షిజారా తెగ సంబరపడిపోయింది. 

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News