World Cup 2023 Qualifiers: వరల్డ్ కప్ 2023కి నేరుగా అర్హత సాధించడంలో విఫలమైన మాజీ ఛాంపియన్ విండీస్.. ఈసారి క్వాలిఫయర్ మ్యాచ్‌లు ఆడనుంది. క్వాలిఫయర్ మ్యాచ్‌ల్లో గెలిస్తేనే వరల్డ్ కప్‌కు అర్హత సాధిస్తుంది. భారత్ వేదికగా ఈ ఏడాది ప్రపంచకప్ జరుగుతోంది. ప్రధాన మ్యాచ్‌లకు ముందు ఐసీసీ క్వాలిఫయర్ మ్యాచ్‌లను నిర్వహించనుంది. ఈ మ్యాచ్‌లకు వెస్టిండీస్ జట్టును ప్రకటించారు. షై హోప్ కెప్టెన్సీలో విండీస్ జట్టు రంగంలోకి దిగనుంది. చాలా రోజుల తరువాత జాన్సన్ చార్లెస్‌కు కూడా టీమ్‌లో అవకాశం దక్కింది. అయితే ఐపీఎల్‌లో మెరుపులు మెరిపిస్తున్న హిట్‌మేయర్‌కు జట్టులో చోటు దక్కలేదు.
వరల్డ్ కప్ 2023 క్వాలిఫయర్స్ మ్యాచ్‌లకు రోవ్‌మన్ పావెల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అదేవిధంగా సీనియర్ ఆల్‌రౌండర్ జేసన్ హోల్డర్‌కు కూడా జట్టు అవకాశం కల్పించింది. వీరితో పాటు రోస్టన్ జెస్, అకిల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ కూడా జట్టులో ఉన్నారు. ఈ ఏడాది ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ తరుఫున కైల్ మేయర్స్ మెరుపులు మెరిపించిన విషయం తెలిసిందే.
గుడ్కేశ్ మొట్టి ప్లేస్‌లో ఛార్లెస్‌కు జట్టులో చోటు దక్కింది. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ అయిన ఛార్లెస్ ఇప్పటివరకు విండీస్ తరుఫున 50 వన్డేలు ఆడాడు. 1370 పరుగులు చేయగా.. 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలు బాదాడు. వన్డేల్లో అత్యుత్తమ స్కోరు 130 పరుగులుగా ఉంది. 41 టీ20 మ్యాచ్‌ల్లో 971 పరుగులు చేశాడు. ఒక సెంచరీ, 4 అర్ధ సెంచరీలు చేశాడు. ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్‌లు జూన్ 18 నుంచి జింబాబ్వేలో ప్రారంభమవుతాయి. హరారే వేదికగా తొలి మ్యాచ్‌లో జింబాబ్వే, నేపాల్ జట్లు తలపడనున్నాయి. వెస్టిండీస్ తొలి మ్యాచ్ అమెరికాతో ఆడనుంది.
Also Read: Anantha Movie Review: అనంత మూవీ రివ్యూ.. సరికొత్త స్టోరీ లైన్
వెస్టిండీస్ టీమ్- షై హోప్ (కెప్టెన్), రోవ్‌మన్ పావెల్ (వైస్ కెప్టెన్), షమర్ బ్రూక్స్, యానిక్ కరియా, కెసి కార్తీ, రోస్టన్ ఛేజ్, జాన్సన్ చార్లెస్, జేసన్ హోల్డర్, అకిల్ హుస్సేన్, అల్జారీ జోసెఫ్, బ్రాండన్ కింగ్, కైల్ మేయర్స్ , కీమో పాల్, నికోలస్ పూరన్, రొమారియో షెపర్డ్.
Also Read: RBI Repo Rates 2023: గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటుపై కీలక ప్రకటన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి