వైరల్ వీడియో: మహేంద్ర సింగ్ ధోనీ బైక్ రైడింగ్

ధోనీ బైక్ రైడింగ్ వైరల్ వీడియో

Last Updated : Sep 1, 2018, 12:20 PM IST
వైరల్ వీడియో: మహేంద్ర సింగ్ ధోనీ బైక్ రైడింగ్

టీమిండియా మాజీ కెప్టేన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైక్ రైడింగ్ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఎప్పుడు, ఏ మాత్రం ఖాళీ సమయం చిక్కినా.. బైక్ తీసుకుని రైడింగ్‌కి వెళ్లడం ధోనికి బాగా అలవాటు. అందులో భాగంగానే ప్రస్తుతం ఓ యాడ్ ఫిలిం షూటింగ్‌లో భాగంగా కుటుంబంతో కలిసి షిమ్లాలో విహరిస్తున్న ధోనీ అక్కడి కొండకోనలపై బైక్ రైడింగ్‌కి వెళ్లగా ధోనికి మేనేజర్‌గా వ్యవహరిస్తున్న రితి స్పోర్ట్ కంపెనీ ఆ వీడియోను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. 

 

 

కేవలం 7 సెకన్ల నిడివే వున్నప్పటికీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో ఇదే.

Trending News