కరోనా వైరస్ కారణంగా అన్ని రంగాలు దెబ్బతిన్నాయి. పలువురు విదేశాలలో చిక్కుకుపోయి నెలల తరబడి భారత్‌కు ఆగమనం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ప్రపంచ చెస్ రారాజు, వరల్డ్ చెస్ మాజీ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ సైతం గత మూడు నెలలుగా విదేశాలలో చిక్కుకుపోయారు. సుదీర్ఘకాలం తర్వాత ఆయన స్వదేశానికి విచ్చేసినట్టు విశ్వనాథన్ ఆనంద్ భార్య అరుణ తెలిపారు. LockDown5.0పై కడుపుబ్బా నవ్వించే జోక్స్
ఐదుసార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ అయిన విషీ మూడు నెలల కిందట జర్మనీ వెళ్లగా, కరోనా వైరస్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. ట్రావెలింగ్ రద్దు చేసిన కారణంగా భారత్‌కు తిరిగిరాలేకపోయారు. ఎయిర్ ఇండియా విమానం (AI-120)లో శుక్రవారం రాత్రి ఫ్రాంక్ ఫర్ట్ నుంచి విషీ బయలుదేరారని, ఢిల్లీ మీదుగా ప్రయాణించి తన భర్త ఆనంద్ బెంగళూరు చేరుకున్నారని పీటీఐతో అరుణ మాట్లాడారు. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!
కర్ణాటక ప్రభుత్వం లాక్‌డౌన్ నియమాల ప్రకారం విశ్వనాథన్ ఆనంద్ 14రోజులపాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. క్వారంటైన్ పూర్తయిన తర్వాత తన భర్త చెన్నైకి వస్తారని తెలిపారు. ఫ్రాంక్ ఫర్ట్ (జర్మనీ) నుంచి కేవలం ఢిల్లీ, బెంగళూరుకు మాత్రమే విమాన సర్వీసులు నడుపుతున్నారు. అయితే జర్మనీ నుంచి వీడియో కాల్స్‌లో విశ్వనాథన్ ఆనంద్ తమకు అందుబాటులో ఉన్నారని, తరచుగ మాట్లాడేవారని అరుణ వెల్లడించారు. . జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
బికినీ అందాలతో రెచ్చిపోయిన నటి