IND Vs SA: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు... గతంలో ఏ కెప్టెన్‌కి సాధ్యం కానిది...

Virat Kohli sets new record: సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా జరిగిన టెస్టులో టీమిండియా విజయం సాధించడంతో కోహ్లి ఖాతాలో కొత్త రికార్డు వచ్చి చేరింది. గతంలో ఏ భారత కెప్టెన్‌కు సాధ్యం కాని ఫీట్‌ను కోహ్లి సాధించాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 30, 2021, 07:48 PM IST
  • సెంచూరియన్ టెస్టు విజయంతో కోహ్లి ఖాతాలో కొత్త రికార్డు
  • సౌతాఫ్రికాలో రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచిన ఏకైక భారత కెప్టెన్
  • విదేశాల్లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన ఆసియా కెప్టెన్
IND Vs SA: విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు... గతంలో ఏ కెప్టెన్‌కి సాధ్యం కానిది...

Virat Kohli sets new record: టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఖాతాలో మరో రికార్డు నమోదైంది. సౌతాఫ్రికాతో తాజా టెస్టు విజయంతో కోహ్లి కొత్త చరిత్ర సృష్టించాడు. సఫారీ గడ్డపై రెండు టెస్టు మ్యాచ్‌లు గెలిచిన ఏకైక భారత కెప్టెన్‌గా కోహ్లి రికార్డ్ క్రియేట్ చేశాడు. గతంలో టీమిండియా తరుపున ఏ కెప్టెన్ సఫారీ గడ్డపై రెండు టెస్టు మ్యాచ్‌లు గెలవలేదు. ఈ ఏడాది టీమిండియా విదేశీ గడ్డపై మొత్తం నాలుగు టెస్టు మ్యాచ్‌లు గెలవడం విశేషం. గతంలో 2018లోనూ ఇదే ఫీట్ నమోదవగా... ఈ ఏడాది టీమిండియా దాన్ని సమం చేసింది.

ఆసియాలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ :

ఆసియా నుంచి విదేశాల్లో అత్యధిక టెస్టు మ్యాచ్‌లు గెలిచిన కెప్టెన్‌గా కూడా విరాట్ రికార్డు సృష్టించాడు. విరాట్ కెప్టెన్సీలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ గడ్డపై భారత్ మొత్తం 7 టెస్టు మ్యాచ్‌లు గెలిచింది. కోహ్లి తర్వాతి స్థానంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్లు వసీం అక్రమ్, జావెద్ మియాందాద్ ఉన్నారు. ఈ ఇద్దరి సారథ్యంలో పాకిస్తాన్ విదేశీ గడ్డపై 4 టెస్టు మ్యాచ్‌లు గెలిచింది.

సెంచూరియన్‌లో టీమిండియాకు తొలి విజయం :

సౌతాఫ్రికాను సెంచూరియన్ మైదానంలో టీమిండియా ఓడించడం ఇది తొలిసారి. ఈ టెస్టు మ్యాచ్‌లో (Ind vs SA) టీమిండియా 113 పరుగుల తేడాతో సఫారీ జట్టుపై విజయం సాధించింది. 305 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సౌతాఫ్రికా జట్టు 191 పరుగులకే కుప్పకూలింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా రాణించి రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. టీమిండియా బౌలర్లలో బుమ్రా, షమీ చెరో మూడు వికెట్లు, మహమ్మద్ సిరాజ్, అశ్విన్ చెరో రెండు వికెట్లు తీశారు.

Also Read: RRR First Review: ఆర్ఆర్ఆర్ ఫస్ట్ రివ్యూ... ఎన్టీఆర్, రాంచరణ్ ఫ్యాన్స్‌ మధ్యన చిచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News