Kohli Dance Video: దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మధ్యలో డ్యాన్స్ చేసిన కోహ్లీ, వీడియో వైరల్

Kohli Dance: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు ఆటలో విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 12:44 PM IST
Kohli Dance Video: దక్షిణాఫ్రికాతో మ్యాచ్ మధ్యలో డ్యాన్స్ చేసిన కోహ్లీ, వీడియో వైరల్

Virat Kohli dance Video Viral: భారత్ జట్టులో విరాట్ కోహ్లీ (Virat Kohli) ఎంత యాక్టివ్ గా ఉంటారో మన అందరికీ తెలిసిందే. కోహ్లీ ఏదో ఒక విధంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తాడు. కొన్నిసార్లు తన అద్భుతమైన బ్యాటింగ్ కారణంగా..మరికొన్నిసార్లు మైదానంలో తన వైఖరితో ఫ్యాన్స్ దృష్టిలో పడతాడు. అయితే, ఈసారి విరాట్ కోహ్లీ తన డ్యాన్స్‌తో సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు. దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు సందర్బంగా అతడికి సంబంధించిన వీడియో నెట్టింట హాల్ చల్ చేస్తోంది.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో (India vs South Africa 1st Test) భారత్ కు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.  ఈ నేపథ్యంలో కోహ్లీ టెస్టు మూడో రోజు మంచి ఉత్సాహంగా కనిపించాడు. మ్యాచ్ లో భారత్ పట్టుబిగించటంతో..కోహ్లీ మైదానంలో డ్యాన్స్ (Virat Kohli dance Video) చేశాడు. అప్పటికీ సౌతాఫ్రికా 7 వికెట్లుకు 177 పరుగులు చేసింది.  ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో (Social Media) ట్రెండ్ అవుతోంది. 

Also Read: India VS South Africa: విజృంభించిన షమీ...భారత్​కు 146 పరుగుల ఆధిక్యం..

ఈ టెస్ట్ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ 94 బంతుల్లో 35 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ సెంచరీతో సత్తా చాటడంతో...భారత్ 327 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ లో ఫ్రోటీస్ జట్టు 197 పరుగులకే ఆలౌట్ అయ్యింది. షమీ (Shami) 5 వికెట్లు తీసి అతిథ్య జట్టు వెన్నువిరిచాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 16 పరుగులు చేసింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News