T20 World Cup 2022: క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. అమ్మకానికి టీ20 వరల్డ్ కప్ టికెట్లు..

T20 World Cup 2022: క్రికెట్ ఫ్యాన్స్ కు శుభవార్త. ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్​ టికెట్లు విక్రయానికి ఉంచినట్లు ఐసీసీ ప్రకటించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 7, 2022, 02:50 PM IST
T20 World Cup 2022: క్రికెట్​ ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్.. అమ్మకానికి టీ20 వరల్డ్ కప్ టికెట్లు..

T20 World Cup 2022: ఆస్ట్రేలియాలో జరిగే పురుషుల టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2022) టిక్కెట్లు అమ్మకానికి ఉంచినట్లు ఐసీసీ (ICC) తెలిపింది. అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 వరకు షెడ్యూల్ చేయబడిన ఈ ఈవెంట్ కోసం టికెట్లను అందుబాటులో ఉంచింది. ఈ టికెట్​ ధరలను (Ticket Rates) పిల్లలకు 5 డాలర్లు(రూ.374), పెద్దలకు 20 డాలర్లుగా (దాదాపు రూ.1495) నిర్ణయించినట్లు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. సోమవారం నుండి t20worldcup.com వెబ్ సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చు. 

టీ20 వరల్డ్ కప్ కు ఆస్ట్రేలియా (Australia) ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. ఈ మెగా టోర్నీ అక్టోబర్​ 16 నుంచి నవంబర్ 13 వరకు జరగనుంది. ఏడు మైదానాల్లో మొత్తంగా 45 మ్యాచ్​లు జరగనున్నాయి. అడిలైడ్, బ్రిస్బేన్, గీలాంగ్, హోబర్ట్, మెల్​బోర్న్, పెర్త్, సిడ్నీ మైదానాల్లో మ్యాచ్ లను నిర్వహించనున్నారు. సెమీఫైనల్స్ సిడ్నీ, అడిలైడ్, ఓవల్ వేదికగా నవంబర్ 9, 10న జరుగుతాయి. ఫైనల్​, నవంబర్ 13న మెల్​బోర్న్​ క్రికెట్ మైదానంలో జరగనుంది. 

Also Read: Shahid Kapoor trolled: 'క్రికెటర్​గా సినిమా తీస్తూ.. క్రికెట్​పై కనీస అవగాహన లేదా?'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News