IND vs ZIM: భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో అనుకోని ఘటన..ఇషాన్‌ కిషన్‌పై తేనేటీగల దాడి..!

IND vs ZIM: అంతర్జాతీయ క్రికెట్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. తాజాగా జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో ఘన విజయం సాధించింది. ఐతే ఈమ్యాచ్‌లో  భారత ఆటగాడు ఇషాన్‌ కిషన్‌కు పెనుప్రమాదం తప్పింది.

Written by - Alla Swamy | Last Updated : Aug 18, 2022, 07:07 PM IST
  • టీమిండియా జోరు
  • జింబాబ్వేతో తొలి వన్డేలో ఘన విజయం
  • తొలి మ్యాచ్‌లో అనుకోని ఘటన
IND vs ZIM: భారత్-జింబాబ్వే మ్యాచ్‌లో అనుకోని ఘటన..ఇషాన్‌ కిషన్‌పై తేనేటీగల దాడి..!

IND vs ZIM: హరారే వేదికగా భారత్-జింబాబ్వే మధ్య తొలి వన్డే జరిగింది. మ్యాచ్ ఆరంభానికి  ముందు అనుకోని ఘటన జరిగింది. భారత ఆటగాళ్లు అంతా జాతీయ గీతం ఆలపిస్తున్నారు. ఈక్రమంలో ఇషాన్‌ కిషన్‌పై తేనేటీగలు దాడి చేశాయి. వెంటనే తేరుకున్న అతడు ఉలిక్కిపడ్డాడు. ఐతే ఈఘటనలో ఇషాన్‌ కిషన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవల జరిగిన సిరీస్‌లకు అతడు బెంచ్‌కే పరిమితమ్యారు. జింబాబ్వేతో జరిగిన తొలి వన్డేలో మాత్రం ఇషాన్‌ కిషన్‌కు తుది జట్టులో స్థానం దక్కింది. ఫస్ట్‌ డౌన్‌లో ఆడేందుకు అవకాశం కల్పించారు. ఐతే ఈమ్యాచ్‌లో ఆడే అవకాశం దక్కలేదు. ఓపెనర్లు శిఖర్‌ధావన్, శుభ్‌మన్ గిల్‌లు మ్యాచ్‌ను గెలిపించారు. ఇటీవల మైదానాల్లో ఆటగాళ్లపై తేనేటీగ దాడులు సర్వసాధారణంగా మారాయి. తాజాగా నెదర్లండ్‌లోనూ ఈ ఘటన జరిగింది. పాక్ ఆటగాడు జమన్‌కు గాయాలయ్యాయి. 

మొత్తంగా జింబాబ్వేలో టీమిండియా శుభారంభం చేసింది. మూడు వన్డేల సిరీస్‌లో తొలి విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 40.3 ఓవర్లలో 189 పరుగులకు ఆలైంది. ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే రెండు అంకెల స్కోర్ చేశారు. ఐదుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్‌కే అవుట్ అయ్యారు. కెప్టెన్ చకబ్వా 35, నగరవ 34, ఈవన్స్ 33 పరుగులు చేశారు. భారత బౌలర్లలో చాహర్, ప్రసిద్ద్ కృష్ణ, అక్షర్ పటేల్ తల మూడు వికెట్లు తీశారు. సిరాజ్ ఒక వికెట్ పడగొట్టాడు.

190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.5 ఓవర్లలో టార్గెట్‌ను చేధించింది. భారత ఓపెనర్లే అదరగొట్టారు. శిఖర్ ధావన్ 81, శుభ్‌మన్ 82 పరుగులు చేశారు. మొత్తంగా 30.5 ఓవర్లలో 192 పరుగులు చేసింది.

Also read:Viral Video: నాగిని డ్యాన్స్‌ ఇరగదీసిన పోలీసులు..వారికి అందిన రివార్డు ఏంటో తెలుసా..?

Also read:PM Kisan: పీఎం కిసాన్ ఈకేవైసీ గడువు పెంపు..కేవైసీని ఇలా పూర్తి చేయండి..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News