India vs Pakistan T20 World Cup Match: పాక్‌తో తొలిపోరు నేడే, టీమ్ ఇండియా తుది జట్టు ఇదే

T20 World Cup: దాయాది జట్టుతో సుదీర్ఘకాలం తరువాత క్రికెట్ పోరు ఇవాళ జరగనుంది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడేందుకు టీమ్ ఇండియా జట్టు దాదాపు సిద్ధమైంది. కొంతమంది క్రికెటర్లను టీమ్ ఇండియా కెప్టెన్ పక్కన పెట్టవచ్చని సమాచారం. ఆ క్రికెటర్లెవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 24, 2021, 08:03 AM IST
  • టీమ్ ఇండియా తుది జట్టులో ఆడే అవకాశాలున్నది ఎవరికి
  • దుబాయ్ వేదికగా సాయంత్రం 7.30 నిమిషాలకు ఇండియా పాకిస్తాన్ టీ20 ప్రపంచకప్ మ్యాచ్
  • ఇప్పచికే తుది జట్టును ప్రకటించిన పాకిస్తాన్
India vs Pakistan T20 World Cup Match: పాక్‌తో తొలిపోరు నేడే, టీమ్ ఇండియా తుది జట్టు ఇదే

T20 World Cup: దాయాది జట్టుతో సుదీర్ఘకాలం తరువాత క్రికెట్ పోరు ఇవాళ జరగనుంది. చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో తలపడేందుకు టీమ్ ఇండియా జట్టు దాదాపు సిద్ధమైంది. కొంతమంది క్రికెటర్లను టీమ్ ఇండియా కెప్టెన్ పక్కన పెట్టవచ్చని సమాచారం. ఆ క్రికెటర్లెవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఇండియా పాకిస్తాన్(India Pakistan Cricket Match)మధ్య క్రికెట్ అంటే ఈ రెండు దేశాలకే కాదు ప్రపంచంలోని క్రికెట్ ప్రేమికులందరికీ కిక్ ఇచ్చే పరిస్థితి. టీ20 ప్రపంచకప్(T20 World Cup)మ్యాచ్ అంటే మరీ ఆసక్తి రేపుతుంది. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో ఈ నిరీక్షణ తొలగే సమయం వచ్చేసింది. ఇవాళ సాయంత్రం దుబాయ్ వేదికగా ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే పాకిస్తాన్ తన తుది జట్టును ప్రకటించింది. ఇండియా టీమ్ (Team India)దాదాపు సిద్ధమైంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ కొంతమందిని పక్కనబెట్టవచ్చని తెలుస్తోంది. టీమ్ ఇండియా తుది జట్టులో ఎవరున్నారు, ఎవరు లేరనేది పరిశీలిద్దాం.

మ్యాచ్‌కు ఒకరోజు ముందు పాకిస్తాన్ జట్టు 12 (Pakistan Final Team)మంది ఆటగాళ్లను ప్రకటించింది. ఇందులో మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ స్థానంలో మొహమ్మద్ రిజ్వాన్‌కు చోటు కల్పించారు. అటు 39 ఏళ్ల షోయబ్ మలిక్ సైతం ఇవాళ మ్యాచ్‌లో ఆడే అవకాశాలున్నాయి. కెప్టెన్ బాబర్ ఆజమ్, ఆసిఫ్ అలీ, ఫఖర్ జమా, హైదర్ అలీ, మొహమ్మద్ రిజ్వాన్, ఈమాద్ వసీమ్, మొహమ్మద్ హఫీజ్, షాదాబ్ ఖాన్, షోయబ్ మలిక్, హైరిస్ రవూఫ్, హసన్ అలీ, షహీన్ షాఙ్ అఫ్రీదీలు పాకిస్తాన్ తుది జట్టులో ఉన్నారు. 

పాకిస్తాన్ తన జట్టును ఇప్పటికే ప్రకటించిన నేపధ్యంలో టీమ్ ఇండియా తుది జట్టు సిద్ధమౌతోంది. టీమ్ ఇండియా ఇంకా తుది జట్టును అధికారికంగా ప్రకటించలేదు. ఓపెనింగ్ రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ చేయవచ్చని తెలుస్తోంది. అటు విరాట్ కోహ్లీ మూడవ స్థానంలో దిగనున్నాడు. ఈషాన్ కిషన్, వృషభ్ పంత్‌లు కచ్చితంగా ఆడే అవకాశాలున్నాయి. ఇక ఆల్‌రౌండర్‌లుగా హార్దిక్ పటేల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్‌లకు అవకాశం ఉండవచ్చు. ఇక మొహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బూమ్రాలు స్పెషలిస్ట్ ఫాస్ బౌలర్లుగా ఉండనున్నారు. మిస్టరీ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి ఉండే అవకాశముంది. అటు శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజాలు కూడా బౌలింగ్ చేయనున్నారు. ఈషాన్ కిషన్ మంచి ఫామ్‌లో ఉన్నందున సూర్యకుమార్ యాదవ్‌ను తప్పించే అవకాశాలున్నాయి. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో వరుణా్ చక్రవర్తికి స్థానం లభించవచ్చు.

టీమ్ ఇండియా తుది జట్టులో..

టీమ్ ఇండియా తుది జట్టులో(Team India Final Team) రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, ఈషాన్ కిషన్, వృషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మొహమ్మద్ షమీ, జస్‌ప్రీత్ బూమ్రా, వరుణ్ చక్రవర్తి ఉండవచ్చు. 

టీ 20 ప్రపంచకప్‌లో(T20 World Cup) భారత పాకిస్తాన్ చివరి మ్యాచ్ 2016 టీ20లో జరిగింది. 2019 వరల్డ్ కప్‌లో మాత్రం రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకూ పాకిస్తాన్‌పై టీమ్ ఇండియానే పైచేయి సాధిస్తూ వచ్చింది. ఈసారి అంటే ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి. 

Also read: Nasser Hussain: టీమిండియా వద్ద ప్లాన్‌-బి లేదు.. అదే ఆ జట్టుకు మైనస్!: నాసర్ హుస్సేన్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News