Suresh Raina: సురేష్ రైనాకు ఆ అదృష్టం లభిస్తుందా, గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో స్థానం ?

Suresh Raina: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో చాలా విచిత్రాలే చోటుచేసుకున్నాయి. ఐపీఎల్‌లో మంచి రికార్డున్న సురేష్ రైనాకు స్థానమే దక్కలేదు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌లో అవకాశం లభించే పరిస్థితి కన్పిస్తోంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 2, 2022, 08:16 PM IST
Suresh Raina: సురేష్ రైనాకు ఆ అదృష్టం లభిస్తుందా, గుజరాత్ టైటాన్స్ టీమ్‌లో స్థానం ?

Suresh Raina: ఐపీఎల్ 2022 మెగా ఆక్షన్‌లో చాలా విచిత్రాలే చోటుచేసుకున్నాయి. ఐపీఎల్‌లో మంచి రికార్డున్న సురేష్ రైనాకు స్థానమే దక్కలేదు. ఇప్పుడు గుజరాత్ టైటాన్స్‌లో అవకాశం లభించే పరిస్థితి కన్పిస్తోంది.

మరి కొద్దిరోజుల్లో ఐపీఎల్ 2022 సీజన్ ప్రారంభం కానుంది. ఇటీవల జరిగిన మెగా ఆక్షన్‌తో అన్ని ఫ్రాంచైజీల టీమ్స్ సిద్ధమయ్యాయి. కొత్తగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఎంట్రీ ఇస్తున్నాయి. అదే సమయంలో భారీగా అంచనాలున్న ప్లేయర్లకు ఆశించిన ధర రాకపోగా..కొంతమందికి మాత్రం రికార్డు స్థాయి ధర పలికింది. అదే సమయంలో కొందరికి అసలు చోటే లభించలేదు. ఈ కోవలోకి వస్తాడు టీమ్ ఇండియా మాజీ ప్లేయర్ సురేశ్ రైనా. ఐపీఎల్ చరిత్రలో మంచి ట్రాక్ రికార్డున్నా సురేష్ రైనాను తీసుకునేందుకు ఏ జట్టూ ఆసక్తి చూపించలేదు. 

అయితే ఇప్పుడు సురేశ్ రైనాకు తిరిగి అదృష్టం తలుపు తట్టే అవకాశం కన్పిస్తోంది. వేలంలో జేసన్ రాయ్‌ను గుజరాత్ టైటాన్స్ 2 కోట్ల కనీస ధరకు సొంతం చేసుకుంది. అయితే వ్యక్తిగత కారణాలతో తాను ఐపీఎల్‌కు అందుబాటులో ఉండనని..ఇప్పటికే ప్రకటించాడు. ఈ క్రమంలో రాయ్ స్థానాన్ని సురేష్ రైనాతో భర్తీ చేయాలనే ఆలోచన వస్తోంది. అయితే ఈ ఆలోచన గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం నుంచి కాకుండా..నెటిజన్ల నుంచి వస్తుండటం విశేషం. నెటిజన్లు పెద్దెఎత్తున సలహాలు, సూచనలు ఇస్తున్నారు. సురేష్ రైనాను తీసుకుంటే పసలేకుండా ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు బలం చేకూరుతుందని కామెంట్లు అందుకున్నారు. జేసన్ రాయ్‌లానే సురేష్ రైనా సైతం విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడగలడని సూచిస్తున్నారు. 

నెటిజన్ల అభిప్రాయం ఇలా ఉంటే..అటు గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం సైతం సురేష్ రైనాను తీసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే 2016, 2017లో గుజరాత్ లయన్స్ జట్టుకు సురేష్ రైనా ఆడిన పరిస్థితి ఉంది. సురేష్ రైనా 205 మ్యాచ్‌లలో 135 స్ట్రైక్‌రేట్‌తో 5 వేల 528 పరుగులు సాధించాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలున్నాయి. గుజరాత్ టైటాన్స్ జట్టు హార్ధిక్ పాండ్యా నేతృత్వంలో బరిలో దిగుతోంది. మరి నెటిజన్ల కోరిక మేరకు సురేష్ రైనాను గుజరాత్ టైటాన్స్ తీసుకుంటుందో లేదో వేచి చూడాలి.

Also read: ICC rankings: 27 స్థానాలు పైకి శ్రేయస్...టాప్​-10లో లేని కోహ్లీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News