ICC T20 WC 2022: టీమిండియా బలంగానే ఉంది..సెమీస్‌కు వెళ్లడం ఖాయమన్న మాజీ హెడ్‌ కోచ్..!

ICC T20 WC 2022: టీ20 వరల్డ్ కప్ ఆడేందుకు టీమిండియా ఆస్ట్రేలియా చేరుకుంది. త్వరలో మెగా టోర్నీ షురూ కానుంది. ఈనేపథ్యంలో భారత మాజీ హెడ్‌ కోచ్‌ రవిశాస్త్రి కీలక సూచనలు చేశాడు. 

Written by - Alla Swamy | Last Updated : Oct 7, 2022, 08:53 PM IST
  • టీ20 వరల్డ్ కప్‌ 2022
  • త్వరలో ప్రారంభం
  • రవిశాస్త్రి కీలక సూచనలు
ICC T20 WC 2022: టీమిండియా బలంగానే ఉంది..సెమీస్‌కు వెళ్లడం ఖాయమన్న మాజీ హెడ్‌ కోచ్..!

ICC T20 WC 2022: టీ20 వరల్డ్ కప్‌ ముందు భారత జట్టును గాయాల బెడద వెంటాడుతోంది. కీలక ఆటగాళ్లు ఒక్కొక్కరిగా జట్టును వీడుతున్నారు. ఇప్పటికే ఆల్‌రౌండర్ జడేజా, పేసర్ బుమ్రా దూరమయ్యాడు. జడేజా స్థానంలో అక్షర్‌పటేల్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఐతే బుమ్రా స్థానంలో ఎవరు ఆడతారన్న దానిపై ఎలాంటి క్లారిటీ రావడం లేదు. బీసీసీఐ సైతం సైలెంట్‌గా ఉంటోంది. ఈనేపథ్యంలో అతడి స్థానంలో ఎవరు ఎంపిక అవుతారన్న ఉత్కంఠ నెలకొంది.

బుమ్రా స్థానంలో మహమ్మద్ షమీని తీసుకోవాలన్న డిమాండ్ ఉంది. ఇటు బౌలింగ్, బ్యాటింగ్‌లో ఆకట్టుకునే దీపక్‌ చాహర్‌ను తీసుకోవాలని మరికొందరు కోరుకుంటున్నారు. వీరిద్దరూ వరల్డ్ కప్‌నకు ప్రకటించిన జట్టులో స్టాండ్‌ బైగా ఉన్నారు. మరోవైపు హైదరాబాద్ పేసర్ సిరాజ్‌ను ఎంపిక చేయాలన్న వాదన ఉంది. బౌన్సీ పిచ్‌లతో అతడు రాణిస్తాడని సీనియర్లు చెబుతున్నారు. ఈనేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు.

బుమ్రా స్థానంలో వచ్చే ప్లేయర్‌పై ఒత్తిడి ఉంటుందన్నాడు. వరల్డ్ కప్ ముందు అతడు జట్టుకు దూరమవడం దురదృష్టకరమని తెలిపాడు. అదే సమయంలో మరో ప్లేయర్‌కు అవకాశం దొరుకుతుందన్నాడు రవిశాస్త్రి. ఇప్పటికీ టీమిండియా బలంగా ఉందన్నాడు. మంచి జట్టుతోనే బరిలోకి వెళ్తోందని అభిప్రాయపడ్డాడు. తప్పకుండా నాకౌట్ దశకు వెళ్తుందని జోస్యం చెప్పాడు. బుమ్రా, జడేజా లేరని నిరాశ అవసరం లేదని తెలిపాడు.

కొత్త ఛాంపియన్‌గా అవతరించేందుకు మంచి అవకాశం దొరికిందన్నాడు రవిశాస్త్రి. షమీని తీసుకుంటే జట్టుకు ఉపయోగపడతారని చెప్పాడు ఆసీస్‌ పిచ్‌లపై అద్భుతంగా వేయగలడన్నాడు. ఇప్పటికే భారత జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లింది. అక్టోబర్ 10, 13 తేదీల్లో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది. 17న ఆసీస్‌తో, 19న కివీస్‌తో వార్మప్ మ్యాచ్‌లు ఆడబోతోంది. ఆ తర్వాత 23న దాయాది దేశం పాకిస్థాన్‌తో తలపడనుంది.

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు మరోమారు భారీ వర్ష సూచన..ఆయా జిల్లాలకు వాతావరణ హెచ్చరికలు..!

Also read:Gautam Gambhir: గ్లోబల్ మెంటార్‌గా అవతారమెత్తనున్న గౌతమ్ గంభీర్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News