Indian Cricket team: సింహంతో శుభ్‌మ‌న్ సెల్ఫీ.. వైల్డ్‌లైఫ్ స‌ఫారీలో సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు..

Indian Cricket team: బాక్సింగ్ డే టెస్టుకు ముందు టీమిండియా క్రికెటర్లు వైల్డ్‌లైఫ్ స‌ఫారీకి వెళ్లారు. కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ తోపాటు జట్టు సభ్యులు ఈ కూడా ఈ సఫారీలో సందడి చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2023, 12:16 PM IST
Indian Cricket team: సింహంతో శుభ్‌మ‌న్ సెల్ఫీ.. వైల్డ్‌లైఫ్ స‌ఫారీలో సందడి చేసిన టీమిండియా క్రికెటర్లు..

Team India-Boxing Day Test: ద‌క్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు టీమిండియా రెడీ అయింది. రేపు అంటే డిసెంబరు 26న సెంచూరియ‌న్ వేదిక‌గా ఇరుజట్లు తలపడనున్నాయి. భారత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరియు జస్ప్రీత్ బుమ్రా తిరిగి జట్టులోకి రానున్నారు. స‌ఫారీ గ‌డ్డ‌పై అంద‌ని ద్రాక్ష‌లా ఉన్న టెస్టు సిరీస్‌ను గెలిచేందుకు ఇదే మంచి సమయం. అందుకు తగినట్లుగానే టీమిండియా నెట్స్‌లో చెమ‌టోడ్చుతోంది. అయితే బాక్సింగ్ డే(Boxing Day) టెస్టుకు ముందు ప్రశాంతత కోసం టీమిండియా వైల్డ్‌లైఫ్ స‌ఫారీ(Wild Life Safari)కి వెళ్లింది. హెడ్‌కోచ్ రాహుల్ ద్ర‌విడ్, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్, కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌(Rohit Sharma)తో పాటు జ‌ట్టు స‌భ్యులు కూడా ఈ రైడ్‌లో సందడి చేశారు.

భారత స్టార్ ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్‌(Shubman Gill) అయితే ఏకంగా సింహంతో సెల్ఫీ దిగాడు. రాహుల్ ద్రవిడ్, పరాస్ మాంబ్రే మరియు విక్రమ్ రాథోర్‌లు అయితే ఖడ్గమృగంతో ఫోటోలు దిగారు. ఈ టూర్ లో ఆటగాళ్లు బాగానే ఎంజాయ్ చేసినట్లు ఫోటోలు, వీడియోలు చూస్తే అర్థమవుతోంది. స‌ఫారీ టూర్ ఫొటోల‌ను గిల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఇవి కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కుడి చేతివేలి గాయం కార‌ణంగా టెస్టు సిరీస్ నుంచి వైదొలిగిన ఓపెన‌ర్ రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) స్థానంలో బెంగాల్ ఓపెన‌ర్ అభిమ‌న్యు ఈశ్వ‌ర‌న్‌(Abhimanyu Eshwaran)ను జట్టులోకి తీసుకుంది జట్టు యాజమాన్యం.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (c), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (wk), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా (vc), ప్రసిద్ కృష్ణ, KS భరత్ (wk), అభిమన్యు ఈశ్వరన్

Also Read: IND W vs AUS W: ఏకైక టెస్టులో అదరగొట్టిన మన అమ్మాయిలు.. ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News