T20 World Cup 2021: పాకిస్తాన్ (Pakistan) తో జరిగిన మ్యాచ్ లో భారత్ (India) ఓడిన సంగతి మన అందరికీ తెలిసిందే.. మంగళవారం జరిగిన పాకిస్తాన్ Vs న్యూజిలాండ్ (Paksitan Vs New Zealand) మధ్య జరిగిన మ్యాచ్ లో కూడా పాక్ గెలిచిన సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో ఇపుడు కొత్తగా భారత్ సెమీస్ చేరేనా..?? అనే కొత్త వాదనలు వినపడుతున్నాయి.
ఇక వరల్డ్ కప్ గ్రూప్-1, గ్రూప్-2 విషయాలకి వస్తే.. గ్రూప్-2 లో, భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్ (New Zealand), ఆఫ్గానిస్తాన్ (Afghanistan), నమీబియా (Namibia) మరియు స్కాట్లాండ్ (Scotland) టీమ్స్ ఉన్నాయి. ఒక్కో గ్రూపులో ఆరు టీమ్ లు ఉండగా.. ఒక్కో గ్రూపు నుండి రెండు టీమ్ ల చొప్పున మొత్తం నాలుగు టీమ్ లు సెమీస్ చేరతాయి. ప్రస్తుతం ఉన్న గ్రూప్-2 లో ఆఫ్గానిస్తాన్, నమీబియా మరియు, స్కాట్లాండ్ టీమ్ లను భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ ఓడిస్తాయని అనుకుందాం..
Also Read: Warning to Mutton Buyers: తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఆంత్రాక్స్.. మటన్ కొనే ముందు ఇవి చూడండి
అంటే భారత్, న్యూజిలాండ్, పాకిస్తాన్ లు మిగిలిన మూడు చిన్న టీమ్ లను ఓడిస్తే ఈ మూడు టీమ్ లకు 6-6-6 పాయింట్లు వస్తాయి.. ఇప్పటికే.. పాకిస్తాన్, న్యూజిలాండ్, టీమిండియా జట్లను ఓడించింది కావున పాకిస్తాన్ 4 పాయింట్లతో ముందంజలో ఉంది.. అంటే మొత్తం పాకిస్తాన్ 10 పాయింట్లతో గ్రూప్-2 లో అగ్రస్థానంలో ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే పాకిస్తాన్ సునాయాసంగా సెమీస్ చేరుతుందని అర్థం.
భారత్, న్యూజిలాండ్ విషయానికి వస్తే.. ఆఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్ టీమ్ లను ఓడించినా.. భారత్ తో తలపడనున్న న్యూజిలాండ్ లో ఏ టీమ్ అయితే విజయం సాధిస్తుందో వారికే సెమీస్ చేరే అవకాశం ఉన్నట్టు.. ఆదివారం అక్టోబర్ 31 వ తేదీన జరగపోయే మ్యాచ్ ఇటు ఇండియాకి అటు న్యూజిలాండ్ టీమ్ లకి కీలక మ్యాచ్ అన్నమాట.. ఈ మ్యాచ్ లతో పాటు.. ఆఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్ లపై గెలిస్తేనే సెమిస్ చేరే అవకాశాలు ఉన్నాయి..
Also Read: Jr NTR: సంజయ్ లీలా భన్సాలీతో జూ. ఎన్టీఆర్ మూవీ..ఇక ఫ్యాన్స్ కు పండగే..!
గమనిక: నిజానికి ఈ థియరీ.. భారత్ - న్యూజిలాండ్.... ఆఫ్గానిస్తాన్, నమీబియా, స్కాట్లాండ్ వంటి చిన్న దేశాలని ఓడిస్తేనే ఇది సాధ్యం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook