/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

ICC Men's T20 World Cup 2022 Starts From October 16: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. టీ20 ప్రపంచకప్‌ 2022 నేటి నుంచి ప్రారంభం కానుంది.  నెల రోజుల పాటు అలరించనున్న ఈ మెగా టోర్నీ.. నవంబర్ 13న జరిగే ఫైనల్ మ్యాచులో ముగుస్తుంది. వన్డే ప్రపంచకప్‌లను రెండు సార్లు (1992, 2015) దిగ్విజయంగా నిర్వహించిన ఆస్ట్రేలియా.. తొలిసారి టీ20 ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇస్తోంది. అక్కడి బౌన్సీ పిచ్‌లు బౌలర్లకు అనుకూలం కాబట్టి.. బ్యాటర్లు చుక్కలు చూపెట్టడం ఖాయం. బ్యాట్, బంతి మధ్య మనం మంచి సమరం చూడొచ్చు. 

టీ20 ప్రపంచకప్‌ టోర్నీలో నేటి నుంచి తొలి రౌండ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. సూపర్‌-12లో చోటు కోసం ఎనిమిది జట్లు తలపడనున్నాయి. గ్రూప్‌- ఎలో నమీబియా, శ్రీలంక, నెదర్లాండ్స్‌, యూఏఈ.. గ్రూప్‌- బిలో స్కాట్లాండ్‌, వెస్టిండీస్, ఐర్లాండ్‌, జింబాబ్వే తలపడతాయి. తొలి రౌండ్‌ మ్యాచ్‌లు ముగిసే సరికి గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో ఉన్న జట్లు సూపర్‌-12కు అర్హత సాధిస్తాయి. ఇప్పటికే సూపర్‌-12కు 8 జట్లు అర్హత సాధించాయి. గ్రూప్‌-1లో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్.. గ్రూప్‌-2లో బంగ్లాదేశ్, భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా జట్లు ఉన్నాయి. 

సూపర్‌-12 మ్యాచులు అక్టోబర్ 22 నుంచి ఆరంభం అవుతాయి. మెగా టోర్నీ తొలి మ్యాచులో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. 23న దాయాదులు భారత్, పాకిస్తాన్ ఢీ కొట్టనున్నాయి. ఇక సూపర్‌-12లో ఒక్కో గ్రూప్‌లో ఒక్కో జట్టు మిగతా ఐదు టీంలతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. గ్రూప్‌ల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌ చేరతాయి. సెమీ ఫైనల్‌ గెలిచిన జట్లు నేరుగా ఫైనల్ చేరుతాయి. 

టీ20 ప్రపంచకప్‌ 2022లో మొత్తంగా 45 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లకు ఏడు నగరాలు (జీలాంగ్, అడిలైడ్, బ్రిస్బేన్, హోబర్ట్, మెల్‌బోర్న్, పెర్త్, సిడ్నీ) ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఫైనల్‌ మ్యాచ్ మెల్‌బోర్న్‌లో జరుగుతుంది. సెమీస్ (నవంబర్‌ 9, 10), ఫైనల్‌ (నవంబర్ 13)లకు రిజర్వ్‌ డే ఉంది. 

ఇప్పటి వరకు 7 టీ20 ప్రపంచకప్‌లు జరిగాయి. వెస్టిండీస్‌ రెండు సార్లు (2012, 2016)పొట్టి టోర్నీని కైవసం చేసుకుంది. భారత్‌ (2007),  పాకిస్తాన్ (2009), ఇంగ్లండ్‌ (2010), శ్రీలంక (2014), ఆస్ట్రేలియా (2021) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.   

నేటి మ్యాచ్‌లు: 
శ్రీలంక vs నమీబియా (ఉదయం గం. 9:30 నుంచి)
నెదర్లాండ్స్‌ vs యూఏఈ (మధ్యాహ్నం గం. 1:30 నుంచి) 

Also Read: Pawan Kalyan: విశాఖలో నిలిచిన జనసేనాని పర్యటన, పోలీస్ స్టేషన్ ముందు ధర్నా

Also Read: Bigg Boss Keerthy : అయ్యో ఉన్న 'కీర్తి' కూడా పాయే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Section: 
English Title: 
T20 World Cup 2022 Starts From Today, All you need to know about the Men's T20 World Cup 2022
News Source: 
Home Title: 

నేడే టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం.. బరిలోకి 16 జట్లు! మరిన్ని వివరాలు ఇవే

T20 World Cup 2022: నేడే టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం.. బరిలోకి 16 జట్లు! మరిన్ని వివరాలు ఇవే
Caption: 
Source: File Photo
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

నేడే టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం

బరిలోకి 16 జట్లు

మరిన్ని వివరాలు ఇవే
 

Mobile Title: 
నేడే టీ20 ప్రపంచకప్‌ ప్రారంభం.. బరిలోకి 16 జట్లు! మరిన్ని వివరాలు ఇవే
P Sampath Kumar
Publish Later: 
No
Publish At: 
Sunday, October 16, 2022 - 07:10
Request Count: 
90
Is Breaking News: 
No