T20 World Cup 2022, India vs South Africa: టీ20 ప్రపంచకప్ సూపర్-12లో సఫారీతో పోరుకు సిద్ధమైంది టీమిండియా. పాకిస్థాన్, నెదర్లాండ్ పై గెలిచిన భారత్ కు ఇప్పుడే గట్టి సవాలు ఎదురుకానుంది. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికాకు చెక్ పెడితే టీమిండియాకు దాదాపు సెమీస్ బెర్త్ ఖాయమైనట్లే. ఎందుకంటే తర్వాత భారత్ ఆడబోయేది బంగ్లా, జింబాబ్వే వంటి చిన్న జట్లతో. బంగ్లాదేశ్ పై విజయంతో మాంచి ఊపు మీదున్న ప్రోటీస్ ను ఓడించాలంటే టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు రాణించాల్సిందే. పెర్త్ వేదికగా ఈ మ్యాచ్ సాయంత్రం 4.30 నుంచి ప్రారంభంకానుంది.
అతడు గాడిన పడతాడా...
టీమిండియాను కలవరపెట్టే అంశం కేఎల్ రాహుల్ ఫామ్. ఈ మ్యాచ్ ద్వారానైనా అతడు గాడిలో పడాలని మేనేజ్ మెంట్ ఆశిస్తోంది. మరోవైపు రాహుల్ ను తప్పించి రిషబ్ పంత్ ను ఆడించాలన్న డిమాండ్ కూడా గట్టిగా వినిపిస్తోంది. మరి పంత్ కు అవకాశమిస్తారా లేక రాహుల్ ను కొనసాగిస్తారా అనేది ఇవాళ చూడాలి. నెదర్లాండ్స్ మ్యాచ్ ద్వారా కెప్టెన్ రోహిత్ ఫామ్ లోకి రావడం సానుకూలాంసం. కోహ్లీ, సూర్య భీకరమైన ఫామ లో ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. అయితే వికెట్ కీపర్ బ్యాటర్ కార్తీక్ ను ఈ మ్యాచ్ లోనూ కొనసాగిస్తారా లేక పంత్ కోసం పక్కన పెడతారా అనేది చూడాలి. బౌలింగ్ లో అర్ష్‌దీప్, భువి, షమి త్రయం మంచి ప్రదర్శన చేస్తోంది. ఈ మ్యాచ్ లోనూ సత్తాచాటాలని టీమిండియా యజమాన్యం కోరుకుంటుంది. ఆల్‌రౌండర్లు హార్దిక్, అశ్విన్‌లను కొనసాగించే అవకాశం ఉంది.
పెర్త్ పిచ్ పేసర్లు అనుకూలించే అవకాశం ఉంది. రబాడ, నోకియా, ఎంగిడిలతో కూడిన దక్షిణాఫ్రికా పేస్ దళాన్ని ఎదుర్కోవడం టీమిండియాకు అంత సులువేం కాదు. ఆ జట్టు బ్యాటర్లలో డికాక్, రొసో, మార్‌క్రమ్ భీకరఫామ్ లో ఉన్నారు. మిల్లర్ ఎప్పుడూ ప్రమాదకరమే. కెప్టెన్ బపుమా ఫామ్ ఒక్కటే ఆ జట్టును కలవరపెట్టే అంశం. టీ20 వరల్డ్ కప్ లో భారత్-దక్షిణాఫ్రికాలు ఐదుసార్లు తలపడితే... టీమిండియా నాలుగు, సఫారీ ఒక్క మ్యాచ్ లోనూ గెలిచాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి