IND vs PAK: ఇండియాని ఓడించాక పాకిస్తాన్‌ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే...!

IND vs PAK: టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజయం చెందిన సంగతి తెలిసిందే. అయితే  మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూంలో ఎటువంటి సంబరాలు జరగలేదు. కానీ...  

Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2021, 12:05 PM IST
  • భారత్ పై పాక్ గెలుపు
  • సంబరాలు చేసుకోని పాక్ ఆటగాళ్లు
  • జట్టు సభ్యులకు దిశానిర్దేశం చేసిన కెప్టెన్ బాబర్, కోచ్ సక్లయిక్
IND vs PAK: ఇండియాని ఓడించాక పాకిస్తాన్‌ డ్రెస్సింగ్ రూంలో ఏం జరిగిందంటే...!

T20 WC 2021, IND vs PAK: టీ20 ప్రపంచకప్ 2021(T20 World Cup 2021)లో భాగంగా..భారత్‌పై పాకిస్థాన్(Pakistan) గెలుపొందిన సంగతి తెలిసిందే. అయితే మ్యాచ్ అనంతరం పాకిస్తాన్‌ డ్రెస్సింగ్‌ రూం(Pak Dressing Room)లో ఎటువంటి సంబరాలు జరగలేదు. కానీ ఒక  సమావేశం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ వీడియోలో పాకిస్తాన్.. భారత్‌(Teamindia)ని ఓడించాక సంబరాలు చేసుకోకుండా వేరే పనిలో నిమగ్నమై ఉండటం మనం చూడొచ్చు. పాక్ జట్టు ఆటగాళ్లు, కోచ్‌లు, సహాయక సిబ్బంది అందరూ డ్రెస్సింగ్ రూమ్‌లో సమావేశమయ్యారు. భారత్‌ను ఓడించిన తర్వాత పాక్ జట్టులో కనిపించాల్సిన ఆనందం, సందడి కనిపించలేదు. ఈ వీడియోను పాకిస్తాన్ క్రికెట్(Pakistan Cricket) ట్విట్టర్ హ్యాండిల్ షేర్ చేసింది. దీనిలో కెప్టెన్, కోచ్.. జట్టును ఉద్దేశించి గేమ్ ప్లాన్ గురించి ఆటగాళ్లకు వివరించారు.

Also Read: India Vs Pakistan: 'ఇది కదరా.. అసలైన హుందాతనం'.. ధోని, విరాట్ వీడియో వైరల్

కప్ గెలవటంపైనే ఫోకస్
ఈ వీడియోలో కనిపిస్తున్నట్లుగా మొదట కెప్టెన్ బాబర్ అజమ్(Babar Azam) జట్టును ఉద్దేశించి ప్రసంగించారు. టీమిండియాపై విజయం సాధించిన తర్వాత మనం చాలా నేర్చుకోవాల్సి ఉంది. సంబరాలు చేసుకోవడం అవసరం లేదు. ఎందుకంటే మనం కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచాం. పని ఇంకా పూర్తి కాలేదు. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి పోవద్దు. ప్రపంచ కప్ గెలవడంపై దృష్టిసారించాలని సహచరులకు దిశానిర్దేశం చేశారు.

కెప్టెన్ బాబర్ అజామ్ తర్వాత జట్టు ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్ కూడా మాట్లాడారు. అతను మొదటగా భారత్‌ను ఓడించిన ప్లేయింగ్ XI ఆటగాళ్లను అభినందించారు. ఆ తర్వాత ప్రపంచకప్‌ గెలవడంపై ఆటగాళ్లు దృష్టి సారించాలని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News