SRH to buy Suresh Raina in IPL 2022 Auction: ఐపీఎల్ 2022 మెగా వేలానికి సమయం ఆసన్నమవుతోంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీలలో బీసీసీఐ వేలం నిర్వహించనుంది. మెగా వేలం నేపథ్యంలో 1214 మంది ఆటగాళ్లు తమ పేర్లును నమోదు చేసుకున్నారు. స్టార్ ఆటగాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. ఈ ఏడాది నుంచి క్యాష్ రీచ్ లీగ్‌లో రెండు కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ రావడంతో వేలానికి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఏ ఆటగాడిని ఏ జట్టు సొంతం చేసుకుంటుందో అని ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓ స్టార్ ప్లేయర్‌ను జట్టులో చేర్చుకోనుందట.
మరో రెండు వారాల్లో జరగనున్న ఐపీఎల్ 2022 మెగా వేలంలో తెలుగు జట్టు సన్‌రైజర్స్ హైదారాబాద్ (ఎస్ఆర్హెచ్) టీమిండియా మాజీ ప్లేయర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాను తీసుకోనుందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది. వేలంలో ఎలాగైనా రైనాను కొనుగోలు చేయాలని ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ భావిస్తోందట. మిస్టర్ ఐపీఎల్ కోసం 10 నుంచి 12 కోట్ల వరకు వెచ్చించేందుకు ఎస్ఆర్హెచ్ సిద్ధంగా ఉందని సమాచారం. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే.. వేలం వరకు ఆగాల్సిందే.
ఐపీఎల్ ఆరంభం నుంచి గతేడాది వరకు సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకే ఆడాడు. మధ్యలో చెన్నై జట్టుపై రెండేళ్ల నిషేధం పడడంతో.. గుజరాత్ లయన్స్ జట్టుకు అతడు ప్రతినిధ్యం వహించాడు. వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020కి దూరమైన రైనా.. 2021లో ఆడినా పెద్దగా ఆకట్టుకోలేదు. ఒకే ఒక హాఫ్ సెంచరీ తప్ప పెద్ద ఇన్నింగ్స్ ఒక్కటి ఆడలేదు. కొన్ని మ్యాచుల్లో తుది జట్టులో కూడా లేడు. ఫామ్‌లో లేని కారణంగా ఐపీఎల్ 2022 కోసం అతడిని చెన్నై రిటైన్ చేసుకోలేదు.
ఐపీఎల్లో సురేష్ రైనాకు తిరుగులేని రికార్డు ఉంది. 2019 వరకు ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసింది రైనానే. ఒంటి చేత్తోనే ఎన్నోసార్లు చెన్నై జట్టుకు విజయాన్ని అందించాడు. పరుగుల వరద పారించే రైనాకు 'మిస్టర్ ఐపీఎల్'గా పేరుంది. అంతేకాదు చెన్నై ఫాన్స్ ముద్దుగా 'చిన్న తల' అని కూడా పిలుచుకుంటారు. అపార అనుభవం ఉన్న రైనాను తీసుకునేందుకు సన్‌రైజర్స్ హైదారాబాద్ ఆసక్తిగా ఉంది. ఐపీఎల్లో 205 మ్యాచ్‌లు ఆడిన రైనా.. 32.51 సగటుతో 5,528 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, 39 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
Also Read: Salman -Katrina: కత్రినా కైఫ్ వివాహంపై స్పందించిన సల్మాన్ ఖాన్.. ఇంతకీ ఏమన్నారంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook