BWF World Tour Finals 2021: సెమీఫైనల్లో యమగూచిని ఓడించి...ఫైనల్లో అడుగుపెట్టిన సింధు..

PV Sindhu news: బీడబ్ల్యూఎఫ్‌ ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌(BWF World Tour Finals)లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu)యమగూచిపై గెలుపొంది.. ఫైనల్లోకి ప్రవేశించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 4, 2021, 06:17 PM IST
BWF World Tour Finals 2021: సెమీఫైనల్లో యమగూచిని ఓడించి...ఫైనల్లో అడుగుపెట్టిన సింధు..

BWF World Tour Finals 2021: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు(PV Sindhu).. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్​ టూర్ ఫైనల్స్​(World Tour Finals)లో తుది పోరుకు అర్హత సాధించింది. సెమీఫైనల్ మ్యాచ్ లో జపాన్ క్రీడాకారిణి అకానె యమగూచిపై గెలుపొంది.. ఫైనల్లోకి ప్రవేశించింది సింధు. నువ్వా-నేనా అన్నట్లు సాగిన పోరులో చివరకు సింధునే పైచేయి సాధించింది. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత యమగుచి(Akane Yamaguchi)పై 21-15 15-21 21-19 తేడాతో విజయం సాధించింది.  ఈ మ్యాచ్ సుమారు డెబ్బై నిమిషాల పాటు జరిగింది.

Also Read: BWF World Tour Finals: సెమీస్​కు దూసుకెళ్లిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు

అయితే ఫైనల్‌లో సింధు... దక్షిణ కొరియా ప్లేయర్‌ సెయంగ్‌తో తలపడనుంది. ఇక ఈ టోర్నీలో మరో భారత ప్లేయర్‌ కిడాంబి శ్రీకాంత్‌(Srikanth) గ్రూప్‌-బి చివరి మ్యాచ్‌లో ఓటమి పాలై సెమీ ఫైనల్‌ కూడా చేరకుండానే నిష్క్రమించాడు. వరల్డ్​ టూర్​ ఫైనల్స్​ తుదిపోరుకు చేరడం సింధు(PV Sindhu)కు ఇది మూడోసారి. 2018లో సింధు ఈ టైటిల్​ గెలుచుకుంది. బీడబ్ల్యూఎఫ్​ వరల్డ్​ టూర్ ఫైనల్స్​కు ముందు పీవీ సింధు.. ఫ్రెంచ్ ఓపెన్, ఇండోనేసియా మాస్టర్స్, ఇండోనేసియా ఓపెన్​లో సెమీస్ వరకు మాత్రమే చేరుకోగలిగింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News