సైనా నెహ్వాల్ బయోపిక్‌ ఫస్ట్‌లుక్ విడుదల

సైనా నెహ్వాల్ బయోపిక్‌ ఫస్ట్‌లుక్ విడుదల

Last Updated : Sep 29, 2018, 02:16 PM IST
సైనా నెహ్వాల్ బయోపిక్‌ ఫస్ట్‌లుక్ విడుదల

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..! ఈ చిత్రంలో ఇటీవలే హిట్టైన బాలీవుడ్ హర్రర్ కామెడీ చిత్రం 'స్త్రీ' లో నటించిన శ్రద్దా కపూర్ నటిస్తోంది. భూషణ్ కుమార్ నిర్మిస్తున్న సైనా నెహ్వాల్ బయోపిక్ చిత్రంలో టైటిల్ రోల్‌లో శ్రద్దా నటిస్తోంది. ఇవాళ టీ-సిరీస్ సైనా పాత్రలో నటిస్తున్న శ్రద్ధాకపూర్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఇందులో ష‌టిల్ బ్యాట్ ప‌ట్టుకొని గట్టిగా అరుస్తున్న‌ట్టు శ్ర‌ద్ధా కనిపిస్తోంది. సైనా లుక్‌ను అచ్చుగుద్దిన‌ట్లు శ్ర‌ద్ధా దింపేసింద‌ని ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. కాగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది.

ఈ పాత్ర పోషిస్తున్న శ్రద్దా కపూర్ (31)మాట్లాడుతూ.. ఈ బయోపిక్ కోసం కష్టపడుతున్నట్లు చెప్పారు. ఉదయాన్నే 6 గంటలకు బ్యాడ్మింటన్ ట్రైనింగ్ కాస్లులకు వెళుతున్నట్లు.. ఇప్పటివరకు 40 బ్యాడ్మింటన్ శిక్షణా తరగతులకు హాజరైనట్లు తెలిపారు. బ్యాడ్మింటన్ కఠిన క్రీడ అని పేర్కొన్న ఆమె.. ఆటలో ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
 
సెప్టెంబర్ 22న పట్టాలెక్కిన ఈ సినిమాని ఆమోల్ గుప్తా డైరెక్ట్ చేస్తున్నాడు. టీసిరీస్ భూష‌ణ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. ర‌చ‌యిత అమితోష్ నాగ్‌పాల్ స్క్రిప్టు అందిస్తున్నారు. అన్ని బ‌యోపిక్‌ల త‌ర‌హాలోనే ఈ చిత్రంలోనూ ఎమోష‌న్స్‌కి పెద్ద పీట వేశార‌ట‌. కాగా.. శ్రద్దా కపూర్ తెలుగులో ప్రభాస్ సరసన 'సాహో' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే..!

 

Trending News